Andhra Pradesh: తల్లితో వివాహేతర సంబంధం‌.. ఇష్టం లేని కూతురు ఏం చేసిందంటే

దేశంలో రోజు, రోజుకు దాడులు, నేరాలు పెరిగిపోతున్నాయి. వీటిలో వివాహేతర సంబంధాలు అధిక శాతం నేరాలకు కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సమాజానికి మాయని మచ్చలా...

Andhra Pradesh: తల్లితో వివాహేతర సంబంధం‌.. ఇష్టం లేని కూతురు ఏం చేసిందంటే
crime news

Updated on: May 03, 2022 | 2:39 PM

దేశంలో రోజు, రోజుకు దాడులు, నేరాలు పెరిగిపోతున్నాయి. వీటిలో వివాహేతర సంబంధాలు అధిక శాతం నేరాలకు కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సమాజానికి మాయని మచ్చలా పెనవేసుకుంటున్న వివాహేతర సంబంధాల కారణంగా హత్యలూ జరుగుతున్నాయి. సొంత వాళ్లనూ హతమార్చేందుకు వెనుకాడటం లేదు. తాజాగా తన తల్లితో వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కూతురు ఆ వ్యక్తిపై కక్ష పెంచుకుంది. నిద్రిస్తున్న సమయంలో ఆ వ్యక్తి మర్మాంగం కోసేసింది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి ఏదేళ్లుగా తెనాలిలో నివాసం ఉంటన్నాడు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఐతానగర్ కు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ విషయం మహిళ కూతురికి తెలిసింది. తన తల్లితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న రామచంద్రారెడ్డిపై సదరు యువతి కక్ష పెంచుకుంది. ఈ క్రమంలో సోమవారం రామచంద్రారెడ్డి మహిళతో కలిసి సినిమాకు వెళ్లాడు. అనంతరం మద్యం తాగి మిద్దెపై పడుకున్నారు. వీరిని గమనించిన బాలిక నిద్రిస్తున్న రామచంద్రరెడ్డి మర్మాంగం కోసేసింది. రామచంద్రారెడ్డి కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు.

బాధితుడిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

– టి. నాగరాజు, టీవీ9 తెలుగు, గుంటూరు

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Bhavana: రెడ్ డ్రెస్‌లో అందాల‌తో కేక పుట్టిస్తోన్న భావన మీనన్.. అదిరిన పిక్స్ లేటెస్ట్ పిక్స్

మరోసారి తెర పై సందడి చేయనున్న సూపర్ పెయిర్..

Konaseema: ప్రేమించి ఓ పాపకు తల్లిని చేసి తప్పించుకుని తిరుగుతున్న ప్రబుద్ధుడు.. జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించిన యువతి