Vallabhaneni Vamsi: ప్రత్యర్ధి ఎంతటోడైనా సరే.. మాటకు నో సెన్సార్.. ఎగొట్టిదిగ్గొట్టడమే..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్టు చేశారు. ఈ కేసుతో పాటు మరికొన్ని కేసుల్లోనూ ఆయన నిందితుడుగా ఉన్నారు. వంశీ అరెస్టుపై వైసీపీ, టీడీపీ పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి.

Vallabhaneni Vamsi: ప్రత్యర్ధి ఎంతటోడైనా సరే.. మాటకు నో సెన్సార్.. ఎగొట్టిదిగ్గొట్టడమే..!
Vallabhaneni Vanshi

Updated on: Feb 13, 2025 | 10:00 PM

వల్లభనేని వంశీ.. తెలుగురాష్ట్రాలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వంశీపేరు చెబితే..గన్నవరం ఏరియాలో ఓ స్టార్‌ హీరోకున్నంత ఎలివేషన్ ఉంటుంది. కృష్ణాజిల్లా రాజీకీయాల్లో పాన్‌ ఇండియా స్టార్‌ కున్నంత నేషనల్ రేంజ్ బిల్డప్ ఉంటుంది. అంతలా పాతుకుపోయింది వంశీ రాజకీయం. పోస్ట్ కార్డు మీద జస్ట్ వంశీ అని రాస్తే చాలు.. డైరెక్ట్‌గా గన్నవరం ఆయన ఇంటి గడపకు చేరేంత చరిష్మా, ఖలేజా ఉన్న సాలిడ్ పర్శనాలిటీ వల్లభనేని వంశీది. మాటకు సెన్సార్ ఉండదు. ప్రత్యర్ధి ఎంతటోడైనా సరే.. ఎగొట్టిదిగ్గొట్టడమే వంశీకి తెలిసిన రాజకీయ విద్య. అందుకే తెగింపు ఆయన ఇంటి పేరు అయ్యింది. తెగేదాకా లాగడం ఆయన ఒంటి తీరుగా మారింది. లేటెస్ట్‌గా వల్లభనేనిని ఎందుకు అరెస్ట్ చేయబడ్డారో తెలుగురాష్ట్రాలకు తెలుసు..! వైసీపీ నేతలు రెడ్‌బుక్ రాజ్యాంగం అనొచ్చు. టీడీపీనేతలు.. చట్టం తనపని తాను చేసుకుపోతోదనచ్చు.. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో…గన్నవరంలో రాజకీయ లెక్కలు తారుమారయ్యాయి. వెంటనే ఆయన ఇంటి అడ్రస్ మారింది. పోస్ట్ కార్డ్ మీద వంశీపేరే కాదు.. టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అడ్రస్ రాసినా దొరకలేదు. గూగుల్ మ్యాపునకూ అంతుపట్టలేదు. అంతగా జనజీవన స్రవంతికి దూరమైపోయారు డాక్టర్ వంశీ. మొత్తానికి గురువారం(ఫిబ్రవరి 13) నాడు హైదరాబాద్‌‌కు వచ్చి మరీ వంశీని అరెస్ట్ చేసి కారులో హైవే మార్గాన సర్రున తీసుకెళ్లి.. జర్రున విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు పోలీసులు. అక్కడి నుంచి వైద్యపరీక్షలు గావించి.. ఎస్సీ, ఎస్టీ కోర్టులో...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి