Andhra Pradesh: రహదారి రక్తసిక్తం.. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. అక్కడికక్కడే నలుగురు మృతి.. పలువురికి గాయాలు..

| Edited By: Jyothi Gadda

Oct 09, 2023 | 12:16 PM

Kadapa: ఆర్టీసీ బస్సు పులివెందుల నుంచి శ్రీశైలం వెళుతుందని ఆటో ప్రొద్దుటూరు నుంచి మల్లెలకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఎర్రగుంట్ల సమీపానికి రాగానే కళ్యాణ మండపం దగ్గర అతివేగంగా వస్తున్న ఆటో ఆర్టీసీ బస్సు రెండు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటో నుజ్జునుజు అయింది. అందులో ప్రయాణిస్తున్న పదిమందిలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా ఆరుగురికి తీవ్రమైన గాయాలు..

Andhra Pradesh:  రహదారి రక్తసిక్తం.. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. అక్కడికక్కడే నలుగురు మృతి.. పలువురికి గాయాలు..
Kadapa Road Accident
Follow us on

కడప జిల్లా, అక్టోబర్10; అతివేగం ప్రమాదానికి కారణం. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఆటో అతివేగంగా వచ్చిందో ఆర్టీసీ బస్సు వేగంగా వస్తుందో తెలియదు గానీ ఈ రెండు ఢీకొని నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి బస్సులో ప్రయాణికులకు ఏమీ కాకపోయినా ఆటోలో ప్రయాణిస్తున్న పదిమందిలో నలుగురు అక్కడికక్కడే చనిపోవడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పొద్దుటూరు నుంచి మల్లెల వెళుతున్న ఆటో ఆర్టీసీ బస్సును ఢీకొని నుజ్జు నుజ్జు అయింది క్షతగాత్రులను పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఎర్రగుంట్ల మండలం ఎర్రగుంట్ల బైపాస్ దగ్గర ఉండే ఎస్వీ కళ్యాణ మండపం దగ్గర ఆటో బస్ ఢీకొని ఆటో లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికడ్డే మరణించారు. ఇందులో ఇద్దరు మగవారు కాగా ఇద్దరు ఆడవారు ఉన్నారు. బస్ లో వారికి ఏమీ కాలేదు. ప్రొద్దుటూరు నుండి మల్లెల కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆటో లో 10 మంది ప్రయాణిస్తుండగా 6 గురికి తీవ్ర గాయాలు అయ్యాయి, 4 గురు అక్కడికక్కడే చనిపోయారు.. వీరంతా కడప నగరం ఆజాద్ నగర్ కాలనీకి చెందిన వారని కడప నుంచి ప్రొద్దుటూరు వెళ్లి అక్కడ నుంచి ఆటోలో మల్లేల పోతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన వారు మహమ్మద్ (25 ), షాకీర్ (10), హసీన (25), అమీన (20)గా గుర్తించారు. మిగిలిన ఆరుగురు గాయపడ్డ వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆర్టీసీ బస్సు పులివెందుల నుంచి శ్రీశైలం వెళుతుందని ఆటో ప్రొద్దుటూరు నుంచి మల్లెలకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఎర్రగుంట్ల సమీపానికి రాగానే కళ్యాణ మండపం దగ్గర అతివేగంగా వస్తున్న ఆటో ఆర్టీసీ బస్సు రెండు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటో నుజ్జునుజు అయింది. అందులో ప్రయాణిస్తున్న పదిమందిలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా ఆరుగురికి తీవ్రమైన గాయాలు కావడంతో వారందరినీ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు అయితే కడపకు చెందిన వీరంతా మల్లెలకు బంధువుల కార్యక్రమమునకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని గాయపడిన వారిలో ఒకరు తెలిపారు ఏదేమైనా అతివేగం కడప జిల్లాలో నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..