Visakhapatnam: తీవ్ర విషాదం.. దుస్తులు ఉతికేందుకు వెళ్లి.. ఊబిలో చిక్కుకుని నలుగురు చిన్నారులు మృతి..

|

Jul 26, 2021 | 7:27 PM

Four children killed drowned in pedderu: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెద్దేరు వాగులో పడి నలుగురు చిన్నారులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన

Visakhapatnam: తీవ్ర విషాదం.. దుస్తులు ఉతికేందుకు వెళ్లి.. ఊబిలో చిక్కుకుని నలుగురు చిన్నారులు మృతి..
Four Children Killed Drowned In Pedderu Visakha
Follow us on

Four children killed drowned in pedderu: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెద్దేరు వాగులో పడి నలుగురు చిన్నారులు మృతిచెందారు. ఈ విషాద సంఘటన విశాఖ జిల్లా వి.మాడుగుల మండలం జాలంపిల్లి వద్ద చోటుచేసుకుంది. సోమవారం ఉదయం దుస్తులు ఉతికేందుకు వెళ్లి.. పెద్దేరు వాగులో గల్లంతయ్యారు. కాగా.. దుస్తులు ఉతికేందుకు కుటుంబ సభ్యులు వెళ్తుండగా.. వారితో కలిసి ఈ చిన్నారులంతా వెళ్లారు. ఈ క్రమంలో ఈ చిన్నారులంతా ప్రమాదవశాత్తు పెద్దరేవు ఊబిలో చిక్కుకొని గల్లంతయ్యారు. అనంతరం కుటుంబసభ్యలు గ్రామస్థులకు తెలియజేయడంతో.. వారు సంఘటన స్థలానికి చేరుకొని.. చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. వీరంతా గిరిజన కుటుంబాలకు చెందినవారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మృతిచెందిన వారిలో నీలాపు మహేందర్ (7), వంత్తాల వెంకట ఝాన్సీ (10), వంత్తాల షర్మిల (7) వంత్తాల ఝాహ్నవి (11) ఉన్నారు. చనిపోయిన వారిలో ముగ్గురు బాలికలు ఉన్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Sherlyn Chopra: రాజ్‌కుంద్రా కేసులో కొత్త ట్విస్ట్‌.. హీరోయిన్ షెర్లిన్ చోప్రాకు సమన్లు..

Crime: దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి వృద్ధురాలిపై అత్యాచారం.. ఆపై కారం చల్లి క్రూరంగా..