Renuka Chowdhury: సీఎం జగన్‌పై మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. దమ్ముంటే రాజధానికి ఆ పేరు పెట్టాలంటూ సవాల్..
AP Politics: కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా వర్నిలో నిర్వహించిన తెలంగాణ కమ్మ సేవా సమితి నిర్వహించిన..
AP Politics: కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా వర్నిలో నిర్వహించిన తెలంగాణ కమ్మ సేవా సమితి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడిన మాజీ మంత్రి రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అమరావతిని కమ్మరావతిగా హేళన చేస్తోన్న సీఎం జగన్‌కు దమ్ముంటే రాజధానికి కమ్మరావతి అని పేరు పెట్టాలని సవాల్ విసిరారు. కమ్మ సామాజిక వర్గం ఓర్పును తక్కువగా అంచనా వేయొద్దని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘ఏపీలో కమ్మ సామాజిక వర్గాన్ని అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. అదికూడా అమరావతి కేంద్రంగా ఈ ప్రయత్నాలు జరగడం దారుణం. ఒక రంగు పూసి, ఒక పేరు పెట్టి మమ్మల్ని అణగదొక్కి వెనక్కి తోయాలనుకుంటే భయపడే రకం కాదు. అమరావతిని కమ్మరావతి అంటూ అవహేళన చేస్తున్న సీఎం జగన్ కు చేతనైతే రాజధానికి కమ్మరావతిగా పేరు పెట్టాలి. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మమ్మల్ని తక్కువగా అంచనా వేయకండి. మా మంచితనాన్ని బలహీనతగా చూడకండి. ఒక రాష్ట్రం నిలబడాలంటే అన్ని కులాలు అవసరమే’ అని ఆమె జగన్‌కు చురకలంటించారు.
కాగా 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మొదట అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకు వచ్చారు. అమరావతి శాసన రాజధానిగా, కర్నూల్ ను న్యాయ రాజధానిగా, విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని అసెంబ్లీ వేదికగా జగన్ ప్రకటించారు. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే కొందరు వైసీపీ నాయకులు అమరావతిని కమ్మరావతి అని వ్యాఖ్యానించారు. ఈనేపథ్యంలోనే రేణుకా చౌదరి ఈ కామెంట్లు చేశారని తెలుస్తోంది.
IPL 2022 Purple Cap: రసవత్తరంగా పర్పుల్ క్యాప్ రేస్.. నేటి మ్యాచ్‌తో మళ్లీ అతడికేనా టాప్ ప్లేస్?
Gujarat Elections 2022: గుజరాత్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. AAPకు బిగ్ బూస్ట్..