Perni Nani: ‘ఆయన సూర్యుడు అస్తమించాక బయటకు వస్తారు’: మాజీ మంత్రి పేర్ని నాని

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై మాజీమంత్రి పేర్ని నాని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు.. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ హామీలను ప్రకటించారని ఆరోపించారు. ఆయన గతంలో ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారని ప్రశ్నించారు. వైసీపీ అభ్యర్థుల మార్పును చంద్రబాబు విడ్డూరంగా ఉందని పేర్ని నాని అన్నారు.

Perni Nani: ఆయన సూర్యుడు అస్తమించాక బయటకు వస్తారు: మాజీ మంత్రి పేర్ని నాని
Perni Nani

Updated on: Dec 22, 2023 | 6:02 PM

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై మాజీమంత్రి పేర్ని నాని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు.. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ హామీలను ప్రకటించారని ఆరోపించారు. ఆయన గతంలో ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారని ప్రశ్నించారు. వైసీపీ అభ్యర్థుల మార్పును చంద్రబాబు విడ్డూరంగా ఉందని పేర్ని నాని అన్నారు. అసలు చంద్రబాబు ఎక్కడి నుంచి ఎక్కడకు వచ్చారని అన్నారు. టీడీపీ నేతల స్థానాలను చంద్రబాబు మార్చలేదా అని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ యాత్ర అని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే లోకేష్ యువగళం పాదయాత్ర చేశారని ఆరోపించారు. మేనమామ కొడుకు చనిపోతే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్లలేదన్నారు. లోకేష్ పాదయాత్ర చేసిన కిలోమీటర్లన్నీ తప్పుడు లెక్కలే అని ఘాటుగా స్పందించారు. సాయంత్రం సూర్యుడు ఆస్తమించాక లోకేష్ బయటకు వస్తారన్నారు.

గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు తాను ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి అడ్డగోలుగా దోచుకున్నారని మండిపడ్డారు. ఎప్పటికప్పుడు ప్రజలకు ఎరవేయడం చంద్రబాబుకు అలవాటని ఎద్దేవా చేశారు. తప్పుడు మాటలు, హామీలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలన్నదే చంద్రబాబు ఆలోచన అని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. జగన్ సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు దానికి మూడు రెట్లు ఎక్కువ సంక్షేమం అందిస్తానంటున్నారు. ఇది కేవలం అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే అని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..