Former Minister Perni Nani: బాబు కళ్లలో ఆనందం కోసమే పవన్‌ కల్యాణ్ తాపత్రయం.. పవన్ వీకెండ్ పొలిటిషన్ అంటూ విమర్శలు..

|

Nov 27, 2022 | 5:18 PM

టీడీపీ అధినేత చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే పవన్‌ కల్యాణ్ తాపత్రయపడుతున్నారని ఎద్దేవ చేశారు. సమాజం కోసం పవన్‌ కల్యాణ్ మాట్లాడింది ఏమీ లేదన్నారు..

Former Minister Perni Nani: బాబు కళ్లలో ఆనందం కోసమే పవన్‌ కల్యాణ్ తాపత్రయం.. పవన్ వీకెండ్ పొలిటిషన్ అంటూ విమర్శలు..
Former Minister Perni Nani
Follow us on

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఓ వారాంతపు రాజకీయ నాయకుడంటూ సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. తన నటనా కౌశలంతో ప్రజల్ని ఆహ్లాదపరిచార..టీడీపీ అధినేత చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే పవన్‌ కల్యాణ్ తాపత్రయపడుతున్నారని ఎద్దేవ చేశారు. సమాజం కోసం పవన్‌ కల్యాణ్ మాట్లాడింది ఏమీ లేదన్నారు. పవన్‌కు నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అని విమర్శించారు. ఎవరో సినిమా రైటర్‌ రాసిచ్చిన స్క్రిప్ట్‌ పవన్‌ కల్యాణ్ చదివారని అన్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గోడలను నోటీసులు ఇచ్చి తొలగించారని.. ఇప్పటంలో ఏమీ కూలలేదని అక్కడి వాళ్లే చెబుతున్నారన్నారు. ఇప్పటంలో ఎవ్వరినీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదన్నారు.

చంద్రబాబు దౌర్జన్యంగా పొలాల్లో రోడ్లు వేసినప్పుడు.. పొలాలు తగులబెట్టినప్పుడు మీ గుండెల్లో గుండుసూది కూడా గుచ్చుకోలేదా..? అని ప్రశ్నించారు. ఎన్ని గుడులు, మసీదులు కూలగొట్టారు..? అప్పుడు మీ తోలుమందమైందా పవన్..? అంటూ నిలదీశారు. కోర్టు మొట్టికాయలు వేసినా మీకు బుద్ధి రాలేదు. పవన్‌ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉంది. కోర్టు విధించిన జరిమానా ఎవరు చెల్లిస్తారు?. చంద్రబాబు ప్రభుత్వంలో పొలాలను నాశనం చేసినప్పుడు పవన్‌కు ఏం గుచ్చుకోలేదా..?

ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఎవరైనా రోడ్‌మ్యాప్‌ ఇవ్వాలని అడుక్కుంటారా? అని ప్రశ్నించారు. పవన్‌ మాటలు, వీడియోలు మ్యూజియంలో పెట్టాలన్నారు. 2014లో 67 సీట్లు, 2019లో 151 సీట్లు వచ్చినప్పుడు నోట్లో వేలు పెట్టుకొని చూశావ్‌ కదా? రేపు 175 సీట్లు వచ్చినప్పుడు కూడా అలాగే చూడంటూ సెటైర్ వేశారు.

పవన్‌ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే అని మండిపడ్డారు. పవన్‌ విధానాలు చూసే ప్రజలు ఓటేయలేదన్నారు. 2024లో కూడా ప్రజలు ఓటు వేయరని.. పవన్‌ మాటలు, వీడియోలు మ్యూజియంలో పెట్టాలన్నారు. మంచి పరిపాలన అందిస్తే సినిమాలు చేసుకుంటా అన్నది పవనే.. ప్రతీ ఎన్నికలకూ పవన్‌ ఒక్కో జెండా మారుస్తారని.. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒక వ్యూహం.. లేకుంటే మరో వ్యూహం. ఊసరవెల్లిలా వ్యూహాలు మార్చే వ్యక్తి పవన్‌ పవన్ కల్యాణ్ అని ఎద్దువ చేశారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం