Kodanil Nani: ఉండే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్లు పోతారు.. కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు..

|

Feb 01, 2023 | 8:41 PM

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వ్యవహారంపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కోటంరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని సీఎం జగన్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. కోటంరెడ్డి కన్నా..

Kodanil Nani: ఉండే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్లు పోతారు.. కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు..
Kodali Nani
Follow us on

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వ్యవహారంపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కోటంరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని సీఎం జగన్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. కోటంరెడ్డి కన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారన్నారు. మంత్రి పదవి ఆశించి తన దగ్గరకు రావద్దని సీఎం జగన్ చెప్పినట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే సీటు తనకే ఇస్తానని, పోటీ చేసుకోవాలని సీఎం సూచించారన్నారు. బాలినేని మంత్రి పదవి వదులుకోలేదా.. సీఎం జగన్ ఫోన్ ట్యాపింగ్ చేసి చెత్త మాటలు వినాలా?.. అని ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా 23 మంది వెళ్లిపోయారన్న కొడాలి నాని.. ఉండే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్లు పోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్లిపోతేనే మంచిదని స్పష్టం చేశారు మాజీ మంత్రి కొడాలి నాని.

ఫోన్ ట్యాపింగ్ గురించి కేంద్రానికే కాదు.. ఎఫ్ బీఐకి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఆనాడే జగన్ ను ఏమీ చేయలేకపోయారు. అలాంటిది ఇప్పుడు ఏం చేస్తారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవులను జగన్ కేటాయించారు. మంత్రి పదవులు ఇవ్వలేనని జగన్ చెప్పాక చాలా మంది అర్ధం చేసుకున్నారు.

     – కొడాలి నాని, మాజీ మంత్రి

ఇవి కూడా చదవండి

వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచినా.. మంత్రి పదవి దక్కదనే అనుమానంతోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కొడాలి నాని ఫైర్ అయ్యారు. టీడీపీలో చేరేందుకు ఆయన రెడీ అయ్యారన్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు తమ వద్ద సమాచారాన్ని తమకు షేర్ చేస్తారని కొడాలి నాని వివరించారు. ప్రజలను, దేవుడిని సీఎం జగన్ నమ్ముకున్నారన్న కొడాలి నాని.. శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్లు పోతేనే పార్టీకి మంచిదని అభిప్రాయపడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..