టీడీపీ లీడర్ నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. లోకేశ్ కు ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఎన్ఠీఆర్ వారసులకు పార్టీని ఇవ్వకుండా.. స్వాధీనం చేసుకోవాలని లోకేశ్ కుట్ర పన్నుతున్నారని ఆక్షేపించారు. లోకేష్ కు ఉన్న రాజకీయ అనుభవం ఏంటని ప్రశ్నించారు కొడాలి నాని. తన తండ్రి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని పాదయాత్ర లో చెబుతారా అని నిలదీశారు. చంద్రబాబు, లోకేశ్ లు అవకాశం ఉంటే జుట్టు, లేకపోతే కాళ్లు పట్టుకుంటారని ఫైర్ అయ్యారు. ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది కి ఉద్యోగాలు ఇచ్చారో లోకేశ్ చెప్పాలని కొడాలి నాని నిలదీశారు.
మున్సిపల్ వాహనాలను ఎవరూ ఆపరు. లోకేశ్-పవన్ ను కూడా ఎవరూ అడ్డుకోరు. యువగళంలో స్విమ్మింగ్ పూల్ లో ఎలా ఎంజాయ్ చేయాలో చెప్తారా?. పవన్ కళ్యాణ్ తెలంగాణ లో రెచ్చిపోతే కేసీఆర్ వార్నింగ్ తో ఏపీకి వచ్చేశారు. చంద్రబాబు మానసిక వైకల్య కేంద్రం ఏర్పాటు చేసి ముగ్గురిని జాయిన్ చేస్తాం. 2024 లో వైఎస్.జగన్ మళ్లీ సీఎం అవుతారు.
– కొడాలి నాని, మాజీ మంత్రి
కాగా.. ‘యువగళం’ పాదయాత్ర రెండో రోజులో భాగంగా.. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం నలగామపల్లిలో సాగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ వర్గాల ప్రజలకు రుణాలు, రాయితీలు ఏమైనా ఇచ్చారా? అని లోకేశ్ ప్రశ్నించారు. చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి.. తాడేపల్లి ప్యాలెస్‌లో ఎవరుంటారో మీకు తెలుసా..? అని ఎద్దేవా చేశారు. వైసీపీ బీసీ నాయకులు మాత్రం గేటు బయటే ఉంటారని.. ఓటర్లలో చైతన్యం రావాలని లోకేశ్ పిలుపునిచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..