Andhra Pradesh: రాజకీయాలపై మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు..!

ఎన్టీఆర్‌ పెద్ద అల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలపై సంచలన కామెంట్స్‌ చేశారు. బాపట్ల జిల్లా కారంచేడు ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దగ్గుబాటి.. రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

Andhra Pradesh: రాజకీయాలపై మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు..!
Daggubati Venkateswara Rao

Edited By:

Updated on: Oct 04, 2024 | 6:52 PM

ఎన్టీఆర్‌ పెద్ద అల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలపై సంచలన కామెంట్స్‌ చేశారు. బాపట్ల జిల్లా కారంచేడు ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దగ్గుబాటి.. రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయాలు కాస్ట్‌లీ అయ్యాయని, ఎమ్మెల్యేగా నిలబడాలంటే రూ.30 కోట్లు కావాలన్నారు. అలాగే గెలిచిన తర్వాత మరో రూ. 40 కోట్లు ఖర్చుపెట్టుకోవాల్సి వస్తుందన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని అన్నారు.

చీరాల ఎమ్మెల్యేగా కొండయ్య గెలిచారని, అయితే తీరప్రాంతంలో ప్రమాదవశాత్తు పర్యాటకులు మృతి చెందుతున్నారని రిస్టార్డ్స్ ఓనర్స్‌తో మీటింగ్ పెడితే డబ్బులు దోచుకున్నారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికలలో గెలిస్తే, నిందలు మోయడం తప్పడం లేదన్నారు. తాను ఎంతో తృప్తిగా రాజకీయల నుండి రిటైర్మెంట్ అయ్యానని, బహుశా రాజకీయ వేదికలపై తన ప్రసంగం ఇదే చివరిది అవుతుందేమోనని అన్నారు.

వీడియో చూడండి.. 

తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 60 గ్రామాలకు నీటి వసతి కల్పించానని, ఇప్పటికి ఆ గ్రామాలకు అదే పద్దతుల్లో నీరు సరఫరా జరుగుతున్నందుకు తృప్తిగా ఉందన్నారు. శేష జీవితం పుస్తకాలు రాస్తూ, పిల్లలతో గడుపుతూ తృప్తిగా జీవిస్తానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. దగ్గుబాటి ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఆయన సతీమణి పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి, ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు వేదికపై ఉండటం విశేషం..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..