Watch Video: సముద్రమార్గం గుండా తరలిస్తున్న ఆ కోతులకు ఎందుకంత డిమాండో తెలుసా..

| Edited By: Srikar T

Mar 09, 2024 | 3:45 PM

పశ్చిమ బెంగాల్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న ఉగాండాకు చెందిన కొండ జాతి కోతులను ఇచ్ఛాపురం చెక్‌పోస్టు వద్ద అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఈ అరుదైన కొండ కోతుల అక్రమ రవాణా వెనుక కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖాధికారులు. తాజాగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అటవీ సిబ్బంది సాధారణ తనిఖీలు చేస్తుండగా కోల్‌కతా నుంచి చెన్నై వెళ్తున్న వాహనంపై ప్రత్యేక బోనులో రెండు కోతులను తరలిస్తున్నట్లు గుర్తించారు.

Watch Video: సముద్రమార్గం గుండా తరలిస్తున్న ఆ కోతులకు ఎందుకంత డిమాండో తెలుసా..
Hill Monkeys
Follow us on

పశ్చిమ బెంగాల్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న ఉగాండాకు చెందిన కొండ జాతి కోతులను ఇచ్ఛాపురం చెక్‌పోస్టు వద్ద అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఈ అరుదైన కొండ కోతుల అక్రమ రవాణా వెనుక కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖాధికారులు. తాజాగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అటవీ సిబ్బంది సాధారణ తనిఖీలు చేస్తుండగా కోల్‌కతా నుంచి చెన్నై వెళ్తున్న వాహనంపై ప్రత్యేక బోనులో రెండు కోతులను తరలిస్తున్నట్లు గుర్తించారు. కోతులను అంత పకడ్బందీగా తరలించడంపై అనుమానం వచ్చింది. దీనిపై అటవీ సిబ్బంది ఆరా తీయగా.. కోతులను తరలిస్తున్న సరబ్ మండల్, ధనుజయ్ సింగ్, ముఖేష్ రామ్ పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో అటవీ సిబ్బంది వారందరినీ కాశీబుగ్గ రేంజ్ కార్యాలయానికి తీసుకెళ్లారు.

విశాఖ జూకు తరలింపు..

కోతుల గురించి తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా అటవీ అధికారి నిషా కుమారి, ఉగాండా కోతులను భద్రత కోసం విశాఖపట్నం జూకు తరలించారు. ఇక్కడ వాతావరణ, ఆహార పరిస్థితులకు ఇబ్బంది పడకుండా ఆ కోతులకు పండ్లు, నీటితో పాటు ఎయిర్ కండిషన్డ్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వన్యప్రాణుల అక్రమ రవాణా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అరుదైన కోతుల తరలింపు వెనుక..

ఈ అరుదైన జంతువుల స్మగ్లింగ్‌ వెనుక చాలా ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఒడిశా-ఏపీ పలాస సరిహద్దులో ఇలాంటి ఘటనలు జరగడంతో అధికారులు దీని వెనుక ఉన్న రాకెట్‎ను ఛేదించే పనిలో పడ్డారు. సముద్ర మార్గంలో అక్రమంగా తరలిస్తున్న ఈ అడవి జంతువుల స్మగ్లింగ్ వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్టు సమాచారం. కొన్ని ఔషద తయారీ కంపెనీలు కొన్ని కీలక ప్రయోగాలు చేసేందుకు తరలించే అవకాశం ఉందని, అందుకు అనుమతులు అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ అనుమతులు సాధారణంగా దొరకవు కాబట్టే ఇలా అక్రమంగా తరలిస్తూ ఉండొచ్చని అనుమానం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

సరికొత్త జాతిని సృష్టించే విదేశీ ప్రయత్నమా?

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎ. మురళీకృష్ణ టీవీ9 తో మాట్లాడుతూ.. మేలిమి జాతి కోతుల పెంపకం కోసం కొన్ని విదేశీ కంపెనీలు ఇలా విదేశీ కోతులతో బ్రీడింగ్ జరిపి ఇంతే సామర్ధ్యం గల మేలిమి జాతిలను సృష్టించే అవకాశం కూడా లేకపోలేదని తెలిపారు. వీటిని భారతదేశంలో పెంచి, సముద్ర మార్గం గుండా విదేశాలకు తరలిస్తారని అధికారులు అనుమానిస్తున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఈ వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. తాజా ఘటనతో సరిహద్దు చెక్ పోస్ట్‎లను మరింత బలోపేతం చేయాలని అధికారులు భావిస్తున్నారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..