Andhra Pradesh: ఊరి శివారు ప్రాంతంలో కనిపించిన వింత జీవులు.. అటవీ సిబ్బంది ఆరా తీయగా..!
గతంలో అడవి పందుల కోసం ఉచ్చులు బిగిస్తే చిరుత పులి ఉచ్చులో చిక్కుకుని చనిపోయింది. కొంత కాలం తరువాత తెల్లవారుజామున అటువైపు ఆర్టీసీ బస్సు వెళుతుండగా పులి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిందని కండక్టర్ చెప్పడంతో పెద్ద ప్రచారం జరిగింది. ఇలా ఆ ప్రాంతంలో పులి ప్రచారం నడూస్తూనే ఉంది. ఈ క్రమంలో పసి కూనలు కనిపించడంతో కలకలం రేగింది.

పశ్చిమ గోదావరి జిల్లాలో వింత జీవులు కలకలం సృష్టించాయి. ఆగిరిపల్లి మండలంలో పులి పిల్లలు కనిపించాయి అంటూ దుమారం రేగింది. పులి పిల్లలు కనిపించాయి. పులి వస్తుంది అని ప్రచారం జరగడంతో సగ్గూరు, కృష్ణవరం ప్రాంతాలలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగింది.
కొందరు స్థానికులు పొలం పనులకు వెళ్ళినప్పుడు అటవీ ప్రాంతంలో పులి పిల్లలను గుర్తించారు. వాటిని పట్టుకుని పరిశీలించి పులి పిల్లలను పెట్టిందని, పులి వస్తుందని ప్రచారం చేశారు స్థానికులు. సెల్ ఫోన్ లో పులి పిల్లలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పులి పిల్లలు వీడియోలు చూసిన స్థానికులు పులి పిల్లలకోసం వస్తుందని భయభ్రాంతులు వ్యక్తం చేశారు. వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఇదే ప్రాంతంలో గతంలో అడవి పందుల కోసం ఉచ్చులు బిగిస్తే చిరుత పులి ఉచ్చులో చిక్కుకుని చనిపోయింది. కొంత కాలం తరువాత తెల్లవారుజామున అటువైపు ఆర్టీసీ బస్సు వెళుతుండగా పులి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిందని కండక్టర్ చెప్పడంతో పెద్ద ప్రచారం జరిగింది. ఇలా ఆ ప్రాంతంలో పులి ప్రచారం నడూస్తూనే ఉంది. తాజాగా పులి పిల్లల సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అడవిలోని ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వాటిని పరిశీలించి పులి పిల్లలు కాదు అడవి పిల్లి (జంగిల్ కేట్) పిల్లలు అని నిర్దారించారు. దీంతో స్థానికులు ఉపిరి పీల్చుకున్నారు.
అడవి పిల్లి పిల్లలుగా వాటిని గుర్తించామని వాటిని ఎక్కడికి కదపకూడదని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హరి గోపాల్ అంటున్నారు. తల్లి వస్తుందని, తల్లి వచ్చిన సమయానికి పిల్లలు అక్కడ లేకపోతే మరలా వాటిని ముట్టుకోదని అంటున్నారు. పిల్లి స్వభావం ప్రకారం తన పిల్లలను ఒక చోటు నుండి మరొక చోటికి మారుస్తుందని అంటున్నారు. పిల్లి మార్చిన స్థలంలో కాక మరొక చోట పిల్లలు ఉంటే తనవి కాదని వదిలేస్తుందని అంటున్నారు హరి గోపాల్. ఇప్పుడు గుర్తించిన అడవి పిల్లి పిల్లలను యథాస్థానంలో ఉంచేస్తామని అటవీ సిబ్బంది తెలిపింది. అప్పుడప్పుడూ ఇలా అడవి పిల్లి పిల్లలు కనిపిస్తాయని అంటున్నారు ఫారెస్ట్ అధికారి హరి గోపాల్.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..