AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: చంద్రబాబు విజన్.. లోకేశ్ డైరెక్షన్.. రాష్ట్రంలో వాట్సాప్‌ ద్వారా 161 రకాల సర్వీసులు

ప్రజల వద్దకే పాలన అన్నట్లు... దేశంలోనే ఫస్ట్‌ టైమ్‌ వాట్సాప్‌ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. పౌర సేవలను మరింత సులభతరం చేస్తూ.. 161 రకాల సేవలను వాట్సాప్‌ ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ఈ సేవలను ప్రారంభించారు మంత్రి లోకేష్.

Andhra: చంద్రబాబు విజన్.. లోకేశ్ డైరెక్షన్.. రాష్ట్రంలో వాట్సాప్‌ ద్వారా 161 రకాల సర్వీసులు
Nara Lokesh
Ram Naramaneni
|

Updated on: Jan 30, 2025 | 3:03 PM

Share

దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. ఈ సేవలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. 9552300009 నెంబర్‌కి మెసేజ్ చేస్తే చాలు.. 161 రకాల ప్రజలు సేవలు పొందొచ్చు. టీటీడీ సహా దేవాలయ టికెట్లు, APSRTC, అన్న క్యాంటీన్, సీఎంఆర్‌ఎఫ్‌, గ్రీవెన్సెస్, మున్సిపల్‌ సహా అనేక రకాల సేవలను వాట్సాప్ ద్వారానే పొందవచ్చు.

పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలిసిన లోకేష్.. ప్రభుత్వ సర్టిఫికెట్లు, సేవలు పొందడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు వాట్సాప్ సేవలు ప్రారంభించినట్టు స్పష్టం చేశారు మంత్రి లోకేష్. రెండో విడతలో మరో 360సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఫేక్ సర్టిఫికెట్ల బెడద లేకుండా ప్రతి సర్టిఫికెట్‌కి క్యూ ఆర్ కోడ్ ఇస్తారు. ఆ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో వివరాలు వస్తాయన్నారు మంత్రి లోకేష్. ఒక్క బటన్ ద్వారా అనేక సర్వీసులు డోర్ డెలివరీ అవుతున్నాయి. ప్రభుత్వ సేవలు ఎందుకు రాకూడదనే ఆలోచనతోనే వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు మంత్రి లోకేష్.

ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే… ఈ వాట్సప్‌ ఖాతా ద్వారానే సందేశం పంపించనుంది. ప్రకృతి విపత్తులు, భారీ వర్షాల సమయంలో వాట్సాప్‌ మేసేజ్‌ల ద్వారానే అలర్ట్‌ చేయనుంది. మీ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా ఈ వాట్సాప్‌ ద్వారా తెలియజేయనుంది. అలాగే ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు ఏవైనా ఇవ్వాలనుకుంటే వాట్సాప్‌ సేవలను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వాడుకోవచ్చు.

ప్రభుత్వం ప్రకటించిన నెంబర్‌కు మెసేజ్‌ చేస్తే… వెంటనే ఓ లింక్‌ వస్తుంది. అందులో సంబంధిత వ్యక్తి పేరు, ఫోన్‌ నంబరు, చిరునామా పొందుపరిచి.. వినతిని టైప్‌ చేస్తే సరిపోతుంది. వెంటనే వారికి ఒక రిఫరెన్స్‌ నంబరు వస్తుంది. దాని ఆధారంగా తాము ఇచ్చిన వినతి పరిష్కారం ఎంతవరకూ వచ్చింది…? ఎవరివద్ద ఉందనే విషయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. –

అలానే.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అప్‌డేట్‌ను ఈజీగా తెలుసుకోవచ్చు. అర్హులెవరు…? పథకాల లబ్ధి ఎవరికి…? ఎప్పుడు పథకాలు అమల్లోకి వస్తాయన్న విషయాలను వాట్సాప్‌ నంబర్‌కు మెసేజ్‌ చేసి తెలుసుకోవచ్చు. అలాగే విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నులు ఈ అధికారిక వాట్సప్‌ ద్వారా చెల్లించొచ్చు. ట్రేడ్‌ లైసెన్సులూ పొందొచ్చు. దేవాలయాల్లో దర్శనాల స్లాట్‌ బుకింగ్, వసతి బుకింగ్, విరాళాలు పంపడం వంటివి చేయొచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్‌ రికార్డుల యాక్సెస్, వివిధ సర్టిఫికెట్లు పొందొచ్చు. మొత్తం 161రకాల సేవలను ఈ వాట్సాప్‌ ద్వారా పొందవచ్చు.

మొత్తంగా ఇది శాంపిల్ మాత్రమే… ముందుంది అసలు సినిమా అంటోంది ఏపీ ప్రభుత్వం. భవిష్యత్‌లో వాట్సాప్‌ గవర్నెన్స్‌ను మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి