Kadiyapulanka: పూలు అమ్మినచోటే కట్టెలు అమ్ముకోవాల్సిన దుస్థితి.. కనీస ధర లేక రైతన్న విల విల

|

Jan 03, 2023 | 12:47 PM

కడియపు లంక చుట్టుపక్కల గ్రామాలలో 600కు పైగా నర్సరీలు దేశంలోనే ప్రసిద్ధి గాంచాయి. ఇక్కడి పూల మార్కెట్ నుండి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పూల సరఫరా జరుగుతుంది.

Kadiyapulanka: పూలు అమ్మినచోటే కట్టెలు అమ్ముకోవాల్సిన దుస్థితి.. కనీస ధర లేక రైతన్న విల విల
Flower Market Kadiyam Lanka
Follow us on

తూర్పుగోదావరి జిల్లాలోని కడియపు లంక.. ఈ పేరు చెప్పగానే పెళ్లిళ్లు… శుభాకార్యలు, వేడుకలకు ఈ పూల మార్కెట్ నే గుర్తొస్తుంది. అయితే ప్రస్తుతం శుభకార్యలు, ఇతర కార్యక్రమాలు లేకపోవడంతో నూతన సంవత్సర వేళ పూల మార్కెట్ లో పూల ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో పూల రైతులు వ్యాపారాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరం సరైన ధరలు లేవని .. ఆర్ధికంగా చాలా నష్టపోయామంటూ కన్నీరు పెడుతున్నారు పూల వ్యాపారులు.

కడియపు లంక లో గతంలో చామంతి కేజీ రూ.200 పలకగా బంతి రూ.వంద, లిల్లీ రూ.400, మల్లెపూలు రూ.1400, గులాబీ రూ.200, కనకాంబరం బారు రూ.300 ఉండేవి కానీ ఇప్పుడు ఆ ధరలు మూడింతలు తగ్గిపోయాయి.. కేజీ పూల ధర 60రూ. నుండి 80 రూ మాత్రమే పలుకుతున్నాయి. పూల ధరలు లేక ఇతర జిల్లాల నుండి వచ్చే వారికి కనీసం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కడియపు లంక చుట్టుపక్కల గ్రామాలలో 600కు పైగా నర్సరీలు దేశంలోనే ప్రసిద్ధి గాంచాయి. ఇక్కడి పూల మార్కెట్ నుండి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పూల సరఫరా జరుగుతుంది. ఈ మార్కెట్లో హోల్‌సేల్ దుకాణాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. కడియం నుండి రాజమండ్రి, కాకినాడ, అమలాపురం సహా అనేక ప్రాంతాలకు పలు రకాల పూలు ఇక్కడ నుండే హోల్ సేల్ గా తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో కుప్పలు తెప్పలుగా పూల బుట్టలు మిగిలి పోవడంతో ఏమి చేయ్యలేక సమీపంలో ఉన్న కాలువలో పువ్వులను నీటిపాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరో పక్క ఫిబ్రవరి వరకు వివాహ ముహుర్తాలు లేకపోవడంతో.. కనీసం సంక్రాంతి కయినా పూల ధరలు పెరగాలని ఆశిస్తున్నారు పూల  రైతులు, వ్యాపారస్తులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…