Flexy war: ఏపీ వ్యాప్తంగా వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల వార్.. జనసేన నేతలు అరెస్ట్.. ఆందోళనలు

జనసేన ఏర్పాటు చేసిన కౌంటర్ ఫ్లెక్సీలను కొంతమంది వైసీపీ కార్యకర్తలు చించేశారంటూ ఒంగోలులో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. వైసీపీ బ్యానర్లను అలాగే ఉంచి జనసేన ఫ్లెక్సీలను మాత్రమే మునిసిపల్ సిబ్బంది, పోలీసులు తొలగించడం ఏంటని ప్రశ్నించారు జనసైనికులు.

Flexy war: ఏపీ వ్యాప్తంగా వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల వార్.. జనసేన నేతలు అరెస్ట్.. ఆందోళనలు
Jsp Vs Ycp

Updated on: May 30, 2023 | 8:07 AM

ఏపీలో ఫ్లెక్సీల పాలిటిక్స్‌ హీట్‌ పుట్టిస్తున్నాయి. వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం మరింత ముదురుతోంది. నాలుగైదు రోజులుగా కొనసాగుతున్న ఫ్లెక్సీల రగడ కాకరేపుతోంది. ఏపీ వ్యాప్తంగా టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఫ్లెక్సీలో చంద్రబాబు పల్లకిని పవన్‌కళ్యాణ్ మోస్తున్నట్టు చిత్రీకరిస్తూ బ్యానర్లు వేసింది అధికార పార్టీ. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అనే కొటేషన్స్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. అయితే.. రాక్షస పాలనకు అంతం.. ప్రజా పాలనకు ఆరంభం.. అంటూ కౌంటర్ ఫ్లెక్సీలు వేశారు జనసేన కార్యకర్తలు. విశాఖ, ఒంగోలు, నెల్లూరు జిల్లా నాయుడుపేట, పాలకొల్లులో జనసేన పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రెండు పార్టీల వర్గాల మధ్య వివాదానికి దారితీసాయి.

జనసేన ఏర్పాటు చేసిన కౌంటర్ ఫ్లెక్సీలను కొంతమంది వైసీపీ కార్యకర్తలు చించేశారంటూ ఒంగోలులో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. వైసీపీ బ్యానర్లను అలాగే ఉంచి జనసేన ఫ్లెక్సీలను మాత్రమే మునిసిపల్ సిబ్బంది, పోలీసులు తొలగించడం ఏంటని ప్రశ్నించారు జనసైనికులు. మున్సిపల్ సిబ్బంది, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.

మరోవైపు.. పాలకొల్లులో వైసీపీ-జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం ముదురుతొంది. పవన్ కళ్యాణ్ ను కించపరిచే విధంగా వైసీపీ ఫ్లెక్సీలు ఉన్నాయంటూ జనసేన నాయకులు ఆందోళన దిగారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్‌ని కించపరిచేలా వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు జనసేన నేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..