Five students drowned in Krishna river: వారంతా 12-13 సంవత్సరాల పిల్లలే.. వీరంతా ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో.. అందరూ కలిసి ఈత కొట్టేందుకు కృష్ణా నదికి వళ్లారు. ఈ క్రమంలో అందరూ నదిలో ఒకరి తర్వాత ఒకరుగా గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు సోమవారం కృష్ణానదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. దీంతో ఏటూరు గ్రామంలో విషాదం నెలకొంది.
గ్రామానికి చెందిన జెట్టి అజయ్ (12), జెర్రిపోతుల చరణ్ (13), కర్ల బాలయేసు (12), మాగులూరి సన్నీ (12), మైల రాకేష్ (12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో వీరంతా కృష్ణానదికి ఈతకు వెళ్లి గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గజఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, లోతులోకి దిగడంతో వారంతా గల్లంతైనట్లు పేర్కొంటున్నారు. చేతికొచ్చిన పిల్లలు నదిలో గల్లంతు కావడంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. వారి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read: