బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ వద్ద.. కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. కారు నుజ్జునుజ్జయింది. తెలంగాణ రాష్ట్రం పేరుతో రిజిస్టర్ అయిన ఓ కారు.. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వెళ్తోంది. మేదరమెట్ల దక్షిణ బైపాస్ సమీపంలోకి రాగానే కారు టైరు పంక్చరైంది. దీంతో కారు అదుపు తప్పి డివైడర్ ను దాటి అవతలి వైపు ఎగిరి పడిపోయింది. అదే సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అద్దంకి ఎస్ఐ సమందరవలికి చెందిన కారుగా గుర్తించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక కారు డ్రైవర్ ఉన్నారు.
మృతుల్లో ఎస్ఐ సమందర్ వలి భార్య, కూతురు, మరదలు, మరో మహిళ, కారు డ్రైవ ఉన్నారు. సంఘటనా స్థలంలో భార్య, కూతురు మృతదేహాలను చూసి అద్దంకి ఎస్ ఐ సమందర్ వలి కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్సై విలపించడాన్ని చూసి కన్నీరు పెట్టుకున్న సహచర పోలీసులు… అనంతరం ఎస్ఐ ని సముదాయించారు. కారు డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..