Andhra Pradesh: పోలీసులకు సవాలుగా మారిన ఐదు నెలల పసికందు కిడ్నాప్.. పక్షం గడిచినా దొరకని ఆచూకీ..

|

Sep 26, 2022 | 9:32 AM

తన ఐదు నెలల బిడ్డ కోసం తల్లి తల్లడిలిపోతుంది. మూడో సంతానంగా జన్మించిన మగ బిడ్డను చూసి మురిసిపోతున్న ఆ తల్లిదండ్రలిద్దరూ తీవ్ర ఆవేదనతో కుమిలిపోతున్నారు. ఐదు నెలలు కూడా పూర్తి కాని తమ బిడ్డ..

Andhra Pradesh: పోలీసులకు సవాలుగా మారిన ఐదు నెలల పసికందు కిడ్నాప్.. పక్షం గడిచినా దొరకని ఆచూకీ..
New Born Baby
Follow us on

Andhra Pradesh: తన ఐదు నెలల బిడ్డ కోసం తల్లి తల్లడిలిపోతుంది. మూడో సంతానంగా జన్మించిన మగ బిడ్డను చూసి మురిసిపోతున్న ఆ తల్లిదండ్రలిద్దరూ తీవ్ర ఆవేదనతో కుమిలిపోతున్నారు. ఐదు నెలలు కూడా పూర్తి కాని తమ బిడ్డ కనిపించకపోవడంతో ఆచూకీ కనిపెట్టాలంటూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. బిడ్డ కిడ్నాప్ అయి 15 రోజులు గడుస్తున్నా.. ఆచూకీ దొరకకపోవడంతో ఓ వైపు బిడ్డ తల్లిదండ్రులు ఆందోళన చెందుడుతుంగా.. పోలీసులకు ఈకేసు సవాలుగా మారింది. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో 15 రోజుల క్రితం ఐదు నెలల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దీంతో బిడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పసికందు కావడంతో ఎటువంటి ఫోటో లేకపోవడంతో పోలీసులకు ఈకేసు ఓ సవాలుగా మారింది. బాలుడు కిడ్నాప్ అయి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఆచూకీ దొరకలేదు. దీంతో ఈకిడ్నాప్ కేసు మిస్టరీగా మారింది.

బాలుడు ఫోటో, ఆధారాలు పోలీసులకు దొరకకపోవడంతో కేసు దర్యాప్తు పోలీసులకు కష్టంగా మారింది. జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు నాలుగు ప్రత్యేక బృందాలు పసికందు ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. కృష్ణాజిల్లాతో పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావకి జిల్లాల్లో కూడా పోలీసులు గాలిస్తున్నారు. చిలకయ్య , వెంకటేశ్వరమ్మ దంపతులు బంటుమిల్లి నాగేశ్వరరావు పేటలోని బస్ షెల్టర్ లో గత 15 ఏళ్లగా జీవనం సాగిస్తున్నారు. వీరు స్థానికంగా చేపల చెరువులపై పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. ఐదు నెలల క్రితం వెంకటేశ్వరమ్మకు మగ పిల్లాడు జన్మించాడు. నాగేశ్వరరావు పేటలోని బస్ షెల్టర్ లో తన బిడ్డతో సహా దంపతులు నిద్రిస్తుండగా పసికిందును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అగంతకులు ఎవరనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది. తమ బిడ్డ కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు చిలకయ్య , వెంకటేశ్వరమ్మ దంపతులు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించినా ఇప్పటివరకు పిల్లాడి ఆచూకీ దొరకలేదు. అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి ఫలితం కనిపించలేదు. బిడ్డను ఎవరైనా అమ్మేందుకు కిడ్నాప్ చేశారా లేక తెలిసినవారు ఎవరైనా పెంచుకునేందుకు కిడ్నాప్ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. తమ బిడ్డ ఆచూకీ కనిపెట్టి తమకు న్యాయం చేయాలంటూ పసికందు తల్లిదండ్రులు పోలీసులను వేడుకుంటున్నారు.