Andhra Pradesh: ఇంత పిచ్చి ఉంటే ఎలా తల్లీ.. భర్త మీద కోపంతో పసికందును ముళ్ల పొదల్లో వదిలి వెళ్లిన వైనం..

Andhra Pradesh: రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి పిచ్చి పని చేసింది. భర్త మీద కోపంతో అప్పుడే పెట్టిన పసిగుడ్డును..

Andhra Pradesh: ఇంత పిచ్చి ఉంటే ఎలా తల్లీ.. భర్త మీద కోపంతో పసికందును ముళ్ల పొదల్లో వదిలి వెళ్లిన వైనం..
Just Born Baby
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 26, 2022 | 9:17 AM

Andhra Pradesh: రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి పిచ్చి పని చేసింది. భర్త మీద కోపంతో అప్పుడే పెట్టిన పసిగుడ్డును పొదల్లో వదేలిసి వెళ్లింది. సమయానికి పోలీసులు రావడంతో పసిబిడ్డ సేఫ్ అయ్యింది కానీ, ఏమాత్రం ఆలస్యం అయినా పరిస్థితి వేరేలా ఉండేది. చివరకు ఆ బిడ్డను మళ్లీ తల్లి ఒడికి చేర్చారు పోలీసులు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏలూరు జిల్లాలోని ఓ ఆస్పత్రిలో మహిళ ప్రసవించింది. పండంటి మగ బిడ్డ జన్మించాడు. అయితే, ఏమైందో ఏమో తెలియదు గానీ, భర్తతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే భర్తపై కోపంతో పసికందును పొదల్లో వదిలేసి.. ఆ తల్లి తన పుట్టింటికి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న భర్త.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఆగిరిపల్లి పొదల్లో బాబును గుర్తించారు. చిన్నారిని రక్షించి తిరిగి ఆస్పత్రిలో వైద్య పరిక్షలు నిర్వహించారు. అనంతరం బాబును తల్లికి అప్పగించారు. కోపంలో పిచ్చి పని చేసిన ఆ తల్లికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. దాంతో కథ సుఖాంతమైంది. కాగా, భర్తపై కోపంతో అప్పుడే పుట్టిన చిన్నారిని పొదల వదిలేయడం స్థానికంగా తీవ్ర కలకం రేపింది. చాలా మంది ఆమె తీరును తప్పుపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..