Road Accident: ఏపీలో రక్తమోడుతున్న రహదారులు.. అనంతపురం జిల్లాలో మరో ప్రమాదం.. ఐదుగురు అక్కడిక్కడే మృతి..

|

Dec 06, 2021 | 12:07 PM

వరుస ప్రమాదాలతో తెలుగు రాష్ట్రాల రోడ్లు రక్తమోడుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద బొలెరో..

Road Accident: ఏపీలో రక్తమోడుతున్న రహదారులు.. అనంతపురం జిల్లాలో మరో ప్రమాదం.. ఐదుగురు అక్కడిక్కడే మృతి..
Five Died, 4 Injured In Roa
Follow us on

వరుస ప్రమాదాలతో తెలుగు రాష్ట్రాల రోడ్లు రక్తమోడుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద బొలెరో వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటన గుమ్మగట్ట మండలం గోనబావి దగ్గర జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందగా, ఐదుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆటోలో ప్రయాణిస్తున్నవారంతే కూలీలుగా గుర్తించారు పోలీసులు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

చిత్తూరు జిల్లా ఐతేపల్లి, అగరాల మధ్య జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలానికి చెందిన మెరైన్‌ ఇంజనీర్‌ కంచారపు సురేష్‌కుమార్‌‌కు ఒక్కగానొక్క కూతురు ఉంది. ఆమోకు తిరుపతిలో తలనీలాల మొక్కు చెల్లించేందుకు ఒకే కుటుంబానికి చెందిన 13 మంది బయలుదేరారు. కానీ మార్గ మధ్యలోనే వారిని విధి వెంటాడింది. డివైడర్ రూపంలో మృత్యువు కబళించింది.

ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మేడమర్తిలో అలముకున్న విషాదం. కొడుకులు, అల్లుడు, కోడళ్లు, కూతుర్లు, మనవలను పోగొట్టుకున్న తల్లిదండ్రుల.. ఆక్రందనలు ఆకాశాన్నంటాయి. మృతుల కుటుంబాలు తీవ్ర శోకంలో మునిగిపోయాయి. ఒకేసారి ఏడు మంది చనిపోవడంతో గ్రామంలో ఎక్కడ చూసినా విషాద ఛాయలు అలుముకున్నాయి. వీలైనంత త్వరగా మృతదేహాలను తీసుకురావాలని వేడుకుంటున్నారు గ్రామస్తులు.

ఇవి కూడా చదవండి: Health Benefits: అయ్యో..! నలుపు అని ఫీల్ అవుతున్నారా.. ఇందులో ఆశ్చర్యకరమైన వాస్తవాలు దాగున్నాయి..

Omicron Tension: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌.. 41 దేశాలకు పాకిన కొత్త వేరియంట్‌..!