
RTC Volvo bus fire : తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆర్టీసీ వాల్వో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కాకినాడ నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో నగరంలోని జిల్లా పరిషత్ సెంటర్ కు చేరుకునే సరికి వెళ్తోన్న బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసి పడ్డాయి . డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. మంటలు రేగిన సమయంలో బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగిననట్టు భావిస్తున్నారు. హుటాహుటీన ప్రమాదస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది బస్సులోని మంటల్ని అదుపులోకి తెచ్చారు.
Travel Bus Fine 2
Read also : ‘వాళ్లు కరుసైపోవడమేకాదు, అకారణంగా ఇతరుల ప్రాణాలు తీసేసినవాళ్లుగా రికార్డులకెక్కుతున్నారు’