Amalapuram: అమలాపురంలో ఆస్పత్రులకు షాకిచ్చిన అధికారులు.. అధిక ఫీజు వసూలు చేసినందుకు రూ.7 లక్షల జరిమానా

|

May 22, 2021 | 10:05 PM

Amalapuram: కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు రోగుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండటంతో..

Amalapuram: అమలాపురంలో ఆస్పత్రులకు షాకిచ్చిన అధికారులు.. అధిక ఫీజు వసూలు చేసినందుకు రూ.7 లక్షల జరిమానా
Follow us on

Amalapuram: కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు రోగుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండటంతో రోగుల కుటుంబ సభ్యులు అయోమయానికి గురవుతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో అధిక ఫీజులు వసూలు చేసిన రెండు ఆస్పత్రులకు అధికారులు భారీగా జరిమానా విధించారు. ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేసినట్లు తెలియడంతో అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. ఈ విషయమై విచారణ చేపట్టిన అధికారులు.. రోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తేలడంతో ఆస్పత్రులకు రూ.7 లక్షలు జరిమానా విధించినట్లు జేసీ కీర్తి చేకూరి తెలిపారు. 48 గంటల్లోగా జరిమానా చెల్లించాలని ఆస్పత్రులకు ఆదేశించినట్లు తెలిపారు.

కాగా, కరోనా రోగులను అదనుగా చేసుకుని చాలా ప్రైవేటు ఆస్పత్రులు రోగుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుస్తున్నాయి. ఈ విషయంపై రోగుల కుటుంబ సభ్యుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధిక ఫీజులు వసూలు చేయవద్దని అధికారులు హెచ్చరించినా.. ఆస్పత్రుల యాజమాన్యాలు పెడచెవిన పెడుతున్నాయి. దీంతో రంగంలోకి దిగుతున్న అధికారులు ఇలా ఆస్పత్రులపై కొరఢా ఝులిపిస్తున్నారు.

ఇవీ చదవండి:

AP Corona: ఏపీలో 10 వేలు దాటిన కరోనా మరణాలు.. తాజాగా ఎన్ని పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటే..!

YS Jagan Letter to PM Modi: ప్రైవేట్‌ ఆస్పత్రులకు నేరుగా కరోనా టీకాలు ఇవ్వద్దు.. వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ