Andhra Pradesh: కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన షురూ.. కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయ్యింది. దీంతో నేటి నుంచి ఏపీ లో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల స్థానంలో ఈ రోజు నుంచి 28 జిల్లాలు అమల్లోకి రానున్నాయి. కొత్తగా ఏర్పాటైన పోలవరం, మార్కాపురం జిల్లాల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీలను నియమిస్తూ ప్రభుత్వం

Andhra Pradesh: కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన షురూ.. కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ
District Re Organisation In Andhra Pradesh

Updated on: Dec 31, 2025 | 7:04 AM

అమరావతి, డిసెంబర్‌ 31: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయ్యింది. దీంతో నేటి నుంచి ఏపీ లో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల స్థానంలో ఈ రోజు నుంచి 28 జిల్లాలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు కొత్తగా ఏర్పాటైన పోలవరం, మార్కాపురం జిల్లాల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. పోలవరం కలెక్టర్ గా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ A S దినేష్ కుమార్ కు ఇంచార్జ్ విధులు నిర్వహించనున్నారు. ఇక మార్కాపురం కలెక్టర్ గా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పోలవరం ఎస్పీ గా అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్‌కు అదనపు బాధ్యతలు అందించారు. మార్కాపురం ఎస్పీ గా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు, పోలవరం జాయింట్ కలెక్టర్ గా అల్లూరి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ కు అదనపు బాధ్యతలు అందించారు.

మార్కాపురం జాయింట్ కలెక్టర్ గా ప్రకాశం జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ కు ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఆయా జిల్లాల్లో కలెక్టర్, జేసీ, ఎస్పీ కార్యాలయాలను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జేసీలు వచ్చేదాకా ఉమ్మడి జిల్లా అధికారులే ఇన్‌చార్జులుగా కొనసాగనున్నారు. డిసెంబర్ 31 నుంచి అన్నమయ్య జిల్లా కార్యకలాపాలు మదనపల్లి కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు రాయచోటి నుంచి పనిచేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారుల కార్యాలయాలు నేటి నుంచి మదనపల్లె నుంచి జరుగుతాయి.

నేటినుంచి ఐదు రెవెన్యూ డివిజన్లు అమల్లోకి..

  • అడ్డరోడ్డు జంక్షన్, అనకాపల్లి జిల్లా
  • అద్దంకి, ప్రకాశం జిల్లా
  • పీలేరు, అన్నమయ్య జిల్లా
  • మడకశిర, శ్రీసత్యసాయి జిల్లా
  • బనగానపల్లి, నంద్యాల జిల్లా

రంపచోడవరం, చింతూరు డివిజన్లు పోలవరంలోకి.. అల్లూరిలో 11 మండలాలు, ఒక డివిజన్‌.. కడప జిల్లాలోకి రాజంపేట డివిజన్‌.. తిరుపతి జిల్లాలోకి రైల్వేకోడూరు.. రాయచోటి డివిజన్‌లో 6 మండలాలు.. మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు తూర్పుగోదావరిలోకి.. సామర్లకోట పెద్దాపురం డివిజన్‌లోకి వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.