బెజవాడ పట్టణంలో మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఫిల్మ్ రేటింగ్ పేరుతో విజయవాడ నగరంలో అమాయకులను టార్గెట్‌గా చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఆన్‌లైన్‌లో ఫిల్మ్ రేటింగ్ ద్వారా లక్షల రుపాయలు లాభలంటూ ఫేక్ ప్రకటనలతో నమ్మిన వారిని బురిడీ కొట్టిస్తున్నారు. అబద్దపు ప్రకటనలతో మోసపోతున్న భాదితులు నిలువునా మోసపోతున్నారు. ఇలాంటి మాయగాళ్ల వలలో చిక్కుకుపోయిన ఓ ఇల్లాలు మిస్సింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఫిల్మ్‌రేటింగ్ పేరుతో లక్షల రూపాయలు చెల్లించిన మహిళ ఇంట్లో వారికి సమాధానం చెప్పలేక.. బలవనర్మణానికి పాల్పడినట్టుగా కుటుంబ సభ్యులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
వాషింగ్టన్ ఫిల్మ్ స్క్వేర్ పేరుతో వెలిసిన సదరు కంపెనీకి విజయవాడకు చెందిన హిమబిందు అనే మహిళ రెండు దఫాలుగా తన భర్తకు తెలియకుండా 7 లక్షల రూపాయలు ఇచ్చింది. మొదటి సారి డబ్బుచెలిస్తే విషయం తెలిసిన హిమబిందు భర్త అడ్డుకున్నాడు.. దాంతో అతనికి తెలియకుండా ఆ తర్వాత సదరు కంపెనీ వారికీ 7లక్షలు ముట్టజెప్పింది. తనడబ్బును తిరిగి ఇవ్వాలని కోరగా కంపెనీ నుండి ఏలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన మహిళ భర్తకు, కుటుంబ సభ్యులకు మోహం చూపించలేక ఇంటి నుండి వెళ్లిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
పోలీసు విచారణలో భాగంగా సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు పోలీసులు. కృష్ణ బ్యారేజ్ వరకు సీసీటీవీలో హిమబిందు కదలికలు ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. కృష్ణ నదిలో దూకి ఆత్మహత్య కు పాల్పడి ఉండవచ్చని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ..