Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే అనుచరుడు దారుణ హత్య.. బైక్ పై వస్తుండగా కాపు కాచి.. కత్తులు, కర్రలతో దాడి..

Ganesh Mudavath

Ganesh Mudavath |

Updated on: Feb 08, 2023 | 6:06 PM

మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొచ్చెరువు గ్రామానికి చెందిన లద్దగిరి శీనును.. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బావిపల్లి వద్ద కాపుకాచి హత్య చేశారు. బైక్ పై వస్తుండగా ప్రత్యర్థులు...

Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే అనుచరుడు దారుణ హత్య.. బైక్ పై వస్తుండగా కాపు కాచి.. కత్తులు, కర్రలతో దాడి..
Representative Image

మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొచ్చెరువు గ్రామానికి చెందిన లద్దగిరి శీనును.. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బావిపల్లి వద్ద కాపుకాచి హత్య చేశారు. బైక్ పై వస్తుండగా ప్రత్యర్థులు కాపు కాసి కత్తులతో నరికి, కర్రలతో కొట్టి చంపారు. డోన్ నియోజకవర్గంలో అందరూ పార్టీ మారినప్పటికీ శీను మారలేదు. ఇతను మైనింగ్ నిర్వహిస్తున్నాడు. అయితే కొంతకాలంగా మైనింగ్ యజమానుల పైన నిర్వాహకుల పైన ఫిర్యాదులు చేసినట్లుగా స్థానికులు చెప్పుకుంటున్నారు. ఈరోజు కూడా చంద్రపల్లి బావిపల్లి దగ్గర తన సుద్ధ మైనింగ్ కార్యకలాపాలు చుసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ దారుణ హత్యపై పలువురు మైనింగ్ యజమానులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తులు, కర్రలను అక్కడే వదిలేసి వెళ్లారు. జలదుర్గం పోలీసులు హత్యాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. హత్య జరిగన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా.. కొన్ని రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అధికార వైసీపీపై ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి పట్టిన దరిద్రమని, ఇది పోవాలంటే సైకిల్‌ అధికారంలోకి రావాలని అన్నారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ కేవలం వైసీపీ కార్యకర్తలకు పథకాలను అందిస్తూ మిగిలిన వారికి మొండి చేయి చూపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారం కోల్పోతుందా.. అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

యువగళం పేరుతో టీడీపీ లీడర్ నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభించనున్నందున వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన విశ్వవిఖ్యాత, నటసార్వభౌముడు ఎన్‌టి.రామారావు అని కొనియాడారు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన నాయకుడు చంద్రబాబు అని గుర్తు చేశారు. ఆ రాష్ట్ర నేడు రాజకీయ ఉన్మాది చేతిలో నలిగిపోతోందని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మె్ల్యే కోట్ల సుజాతమ్మ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu