ఈ మధ్య కాలంలో యువతులకు సోషల్ మీడియా వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఫేస్బుక్, ఇన్స్టా గ్రాం, ట్విట్టర్ ఇలా వేరు వేరు సోషల్ మీడియా పరిచయమై.. ఆ తర్వాత అది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దారితీస్తోంది. విశాఖలో ఐటి ఉద్యోగినికి సోషల్ మీడియా బ్లాక్ మెయిలింగ్ ఘటన మరిచిపోక ముందే.. మరో యువతికి న్యూడ్ ఫోటోలతో మార్ఫింగ్ చేసి హరాస్మెంట్ మొదలైంది. తీవ్ర మానసిక వేదనకు గురైన బాధితురాలు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో.. నిందితుడిని ట్రాక్ చేసి పట్టుకొని కటకటాల వెనక్కు నెట్టారు.
వివరాల్లోకి వెళితే విశాఖ నగరంలోని హెచ్.బి కాలనీకి చెందిన యువతికి anonymous ఫేక్ ఇంస్టాగ్రామ్ అకౌంటు ద్వారా వేధింపులు మొదలయ్యాయి. పోర్న్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన న్యూడ్ ఇమేజ్ తో బాధిత ముఖాన్ని పిక్స్ ఆర్ట్ యాప్ సహాయం తో మార్ఫింగ్ చేశాడు దుండగుడు. మార్ఫింగ్ ఫోటోస్ ని యువతి కి పంపడం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా.. ఆ ఫోటోలను ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫోటోస్ మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో పెడతానని బెదిరింపులకు దిగాడు. విషయం తెలుసుకొని తీవ్ర మానసిక వేదనకు గురైంది. బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సిపి త్రివిక్రమవర్మ ఆదేశాలతో డిసిపి విద్యాసాగర్ నాయుడు నేతృత్వంలో.. విచారణ ప్రారంభించారు సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్. టెక్నికల్ ఎనాలసిస్ చేసి.. మెసేజ్ లు ఎక్కడ నుంచి పోస్ట్ అవుతున్నాయి అనే దానిపై ఆరా తీశారు. మార్ఫింగ్ ఫోటోస్ ను పంపించింది.. తెలంగాణ రాష్ట్రం మెదక్ సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డిపేట కి చెందిన మన్నే మధు(18) అనే యువకుడిగా గుర్తించారు. ప్రత్యేక బృందాన్ని.. సిద్ధిపేట్ కి పంపిచ్చారు. సాంకేతిక సహాయం తో చాకచక్యంగా నిందితుడిని ట్రాక్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో కటకటాల వెనక్కు నెట్టారు.
ఎవరైనా సోషల్ మీడియాలో మహిళల ను ఆగౌరపరిచిన లేదా కించపరిచిన ఉపేక్షించేది లేదని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ K భవాని ప్రసాద్ అన్నారు. తెలియని వ్యక్తుల నుంచి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సప్ లో రిక్వెస్ట్ వచ్చిన యాక్సెప్ట్ చేయకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో సన్నిహితం పనికి రాదని, తెలియని లినక్స్ క్లిక్ చేయవద్దని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పిర్యాదుల కొరకు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in, లేదా టోల్ ఫ్రీ నెంబర్: 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయలని తెలిపారు.