పచ్చని సంసారంలో రూ. 500 చిచ్చు.. కొడుకును అనాథగా చేసిన వైనం..

|

Jan 21, 2024 | 8:06 AM

మద్యానికి బానిసై బలవన్మరణానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. కేవలం తాను మద్యం తాగేందుకు రూ. 500 ఇవ్వలేదని మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటాయి. అయితే తాజాగా జరిగిన పరిణామంతో మద్యపానం కుటుంబ కలహాలకు కారణం అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

పచ్చని సంసారంలో రూ. 500 చిచ్చు.. కొడుకును అనాథగా చేసిన వైనం..
Suicide For Rs.500
Follow us on

మద్యానికి బానిసై బలవన్మరణానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. కేవలం తాను మద్యం తాగేందుకు రూ. 500 ఇవ్వలేదని మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటాయి. అయితే తాజాగా జరిగిన పరిణామంతో మద్యపానం కుటుంబ కలహాలకు కారణం అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. గుడివాడ స్థానిక వాసవీనగర్‌కు చెందిన కొలుసు రాంబాబు(45) ప్రైవేటు ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. గత కొంత కాలంగా మద్యానికి బానిసైన రాంబాబు తన భార్య కనకదుర్గను రూ.500 కావాలని అడిగారు. శనివారం సాయంత్రం తాను మద్యానికి డబ్బులు అడిగితే ఇవ్వని కారణంగా భార్యాభర్తలిరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో మనస్థాపానికి గురైన రాంబాబు ఇంట్లో ఉరేసుకున్నారు. గమనించిన భార్య కనకదుర్గ తన ఇరుగుపొరుగు వారిని పిలిచి వారి సాయంతో భర్తను కిందకు దించారు. కుమారుడు గౌతమ్‌ తండ్రిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. ఇక కట్ చేస్తే భర్త తన వల్ల చనిపోయాడన్న విషయం తెలుసుకున్న భార్య తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కుమారుడు ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేలోపు ఆమె కూడా ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. ఒకవైపు తండ్రి మరణ వార్తలను జీర్ణించుకోలేని వయసు, మరోవైపు తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన. ఈ రెండూ తనను తీవ్ర శోకానికి గురిచేశాయి. మద్యం వ్యసనం 18ఏళ్ల పిల్లగాడిని అనాథగా చేసింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..