Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!

బైక్ పై తండ్రీ కొడుకులు కబుర్లు చెప్పుకుంటూ హుషారుగా వెళ్తున్నారు. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారు కూడా. కానీ అంతలోనే అనుకోని సంఘటన వారి ప్రయాణం మలుపు తిరిగింది..

Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!
Anantapur Accident
Follow us
Nalluri Naresh

| Edited By: Srilakshmi C

Updated on: Nov 20, 2024 | 6:54 PM

అనంతపురం, నవంబర్ 20: విధి ఎంత బలీయమైనది… చావులోనూ కలిసి వెళ్లిన తండ్రి కొడుకులు. మరొక పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారు అనగా…. అనుకోని ప్రమాదం తండ్రీకొడుకులను బలి కోరింది. బైక్ పై వెళుతున్న తండ్రి కొడుకుల పై కరెంటు తీగలు తెగి పడ్డాయి. దీంతో కరెంట్ షాక్కుతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగు పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగు పల్లి గ్రామానికి చెందిన పూజారి రామాంజనేయులు కొడుకు రవి ద్విచక్ర వాహన పై వెళ్తుండగా ఎల్లనూరు మండలం దంతాలపల్లి వద్ద విద్యుత్ లైన్ వైర్లు తెగి బైక్ పై వెళుతున్న వారిపై పడ్డాయి. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారు అనగా కరెంట్ షాక్ తో ఆ తండ్రి కొడుకులు ఇద్దరు మృతి చెందారు. కడప జిల్లా లింగాల మండలం అంకెవారిపల్లి గ్రామంలో తెలిసిన వారి ఇంటికి వెళ్లి తిరిగి బైక్ పై వస్తుండగా… ఉన్నట్టుండి ఒక్కసారిగా విద్యుత్ వైర్లు తెగి తండ్రి కొడుకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంపై పడ్డాయి.

దీంతో కరెంట్ షాక్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగి తండ్రి, కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో రామాంజనేయులు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దేవుడు తండ్రి కొడుకులు ఇద్దరినీ ఒకేసారి తీసుకుపోయాడా?? అని స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.