Andhra Pradesh: ఏపీ రైతులకు డబుల్ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. ఆ రోజున అకౌంట్లలోకి డబ్బు జమ

ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 28వ తేదీన పంట నష్టం పరిహారాన్ని, బకాయి ఉన్న సున్నా వడ్డీ మొత్తాన్ని నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేయబోతోంది.

Andhra Pradesh: ఏపీ రైతులకు డబుల్ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. ఆ రోజున అకౌంట్లలోకి డబ్బు జమ
Andhra Pradesh CM Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 25, 2022 | 3:30 PM

రైతులకు ఎప్పుడూ అండగా నిలబడతామని  ఏపీ సర్కార్ మరోసారి చెప్పకనే చెప్పింది. గోదావరి వరదలు, అకాల వర్షాలు.. ఇతర వైపరిత్యాల కారణంగా పాడైన పంటకు నష్టపరిహారం అందించేందుకు సిద్దమైంది. గొప్ప విషయం ఏమిటంటే.. సీజన్ ముగియక ముందే పరిహారం అందించబోతుంది. నవంబర్ 28వ తేదీన పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45,998 మంది రైతులకు చెందిన 60,832 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది.

ఇందులో 14 జిల్లాల పరిధిలో 24,199 మంది రైతుల 26,540 ఎకరాల్లో ఉద్వాన పంటలు(ఉల్లి, కూరగాయలు, అరటి) దెబ్బతినగా.. 20 జిల్లాల పరిధిలో 21,799 మంది అన్నదాతల 34,292 ఎకరాల్లో వ్యవసాయ పంటలు( వరి, పత్తి, వేరుశనగ, పెసర) పాడయినట్లు ఐడెంటిఫై చేసింది. ఎక్కువగా కోనసీమ జిల్లాలో  12,886 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. పంట నష్టపరిహారానికి అర్హులైన రైతుల జాబితాలను ఇప్పటికే ఆర్బీకేలలో ప్రదర్శిస్తున్నారు. ప్రజంట్ 2022–23లో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 45,998 మంది అన్నదాతలకు ఈ నెల 28న రూ.39.39 కోట్లు ఇవ్వనున్నారు.

అదే రోజు బకాయి ఉన్న సున్నా వడ్డీ నగదు కూడా 

నవంబర్ 28న రైతులకు బకాయి ఉన్న సున్నా వడ్డీ నగదు సైతం సీఎం జగన్ జమ చేయనున్నారు.  2020–21 రబీ సీజన్‌కు సంబంధించి 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు, 2021 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 5.68 లక్షల మందికి రూ.115.33 కోట్లు సున్నా వడ్డీ అకౌంట్లో వేయనున్నారు. ఈ నగదు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు జగన్. మీరు అర్హులో కాదో రైతు భరోసా కేంద్రానికి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయడి..