AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cow care: పాడి రైతు.. ఈ ఆవు కాలిపై బాటిల్ ఎందుకు కట్టాడో తెలుసా?

పొదుగు నిండుగా పాలు ఉన్న ఈ ఆవు కాలుకు ఓ ప్లాస్టిక్ బాటిల్ కట్టి ఉంచడం ఆశ్చర్యాన్ని కలింగించింది. అయితే ఆ పాడి రైతు ఇలా ఎందుకు కట్టారనే కారణాన్ని ఓ పశు వైద్యుడు వివరించాడు. ఆ డీటేల్స్ కథనం లోపల...

Cow care: పాడి రైతు.. ఈ ఆవు కాలిపై బాటిల్ ఎందుకు కట్టాడో తెలుసా?
Cow Care
Ram Naramaneni
|

Updated on: Feb 06, 2026 | 11:42 AM

Share

ఈ రైతు తెలివి చూశారా.. మెత్తడి మ్యాట్ కొనే స్థోమత లేకపోవడంతో.. ఆవు ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ పనికి పూనుకున్నాడు. అందుకే అందరూ అంటారు అవసరం ఆవిష్కరణకు తల్లి లాంటిది అని. సాధారణంగా ఆవు కాలిపై గాయాలున్నప్పుడు.. అవి అటు వైపే కూర్చుంటే..  ఆ గాయాలు మరింత తీవ్రమయి.. ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. ఇది ఆవుకు నొప్పిని కలిగించడమే కాకుండా, దాని ఆరోగ్యంపై, ముఖ్యంగా పాల ఉత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. గాయాలు ఎక్కువ కావడంతో పాలు తగ్గడం జరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి, రైతు ఆవు కాలిపై ఒక బాటిల్‌ను కట్టాడు. ఈ బాటిల్ కూర్చునే సమయంలో శబ్దం చేస్తుంది. ఈ శబ్దం ఆవును హెచ్చరిస్తుంది. అంతేకాదు బాటిల్ కారణంగా అటువైపు కూర్చోడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో గాయం లేని వైపు ఆవు కూర్చుంటుంది. దీనివల్ల గాయాలపై ఒత్తిడి తగ్గి, అవి త్వరగా నయం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ సాధారణ పద్ధతి ద్వారా గాయాల తీవ్రతను తగ్గించి, ఆవు ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. ఫలితంగా, పాలశక్తిని తగ్గకుండా కాపాడుకోవచ్చు, తద్వారా పాడి రైతులు మెరుగైన ఉత్పత్తిని కొనసాగించవచ్చు. ఇది పశువుల సంరక్షణలో ఓ సులభమైన, తెలివైన పరిష్కారం.

అయితే ఈ వీడియోలో ఆ రైతు బాటిల్‌ను చాలా బిగుతుగా కట్టాడు. అలా కట్టకూడదు. రక్త ప్రసరణ ఆగకుండా జాగ్రత్త పడాలి. నూలు తాడు బదులు సాఫ్ట్ క్లాత్ స్ట్రిప్ వాడితే మంచిది. గాయాలున్న పశువుకు తడి నేల పెద్ద శత్రువు.. అందుకే కింద ఎండు గడ్డి.. పాత గోనె సంచులు వేస్తే మంచింది. ప్లాస్టిక్ బాటిల్ ఐడియా బాగానే ఉంది. కానీ షార్ప్ ఎడ్జెస్ లేకుండా కట్ చేసి, టేప్ చుట్టి పెడితే వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

: భద్రం గురూ.. ఆకలి మీద ఉన్న పెద్ద పులి.. అప్రమత్తం లేకుంటే అంతే
: భద్రం గురూ.. ఆకలి మీద ఉన్న పెద్ద పులి.. అప్రమత్తం లేకుంటే అంతే
ఈ ఆవు కాలిపై బాటిల్.. రీజన్ తెలిస్తే వావ్ అంటారు..
ఈ ఆవు కాలిపై బాటిల్.. రీజన్ తెలిస్తే వావ్ అంటారు..
పిల్లబచ్చా టీంలో ఉన్నారని లైట్ తీసుకుంటే, తాట తీస్తారంతే..!
పిల్లబచ్చా టీంలో ఉన్నారని లైట్ తీసుకుంటే, తాట తీస్తారంతే..!
ఈ రాశులవారు వెండిని అస్సలు ధరించొద్దు..! జ్యోతిష్యుల హెచ్చరిక
ఈ రాశులవారు వెండిని అస్సలు ధరించొద్దు..! జ్యోతిష్యుల హెచ్చరిక
హోలీకి ఇంటికెళ్లేవారికి రైల్వేశాఖ శుభవార్త..
హోలీకి ఇంటికెళ్లేవారికి రైల్వేశాఖ శుభవార్త..
రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. డ్రైవర్ చేసి పనితో..
రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. డ్రైవర్ చేసి పనితో..
ఓటీటీలో దుమ్మురేపుతున్న వెబ్ సిరీస్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న వెబ్ సిరీస్..
బంగాళాదుంప తొక్కలను పారేస్తున్నారా.. ఈ నిజం తెలిస్తే అస్సలు వదలరు
బంగాళాదుంప తొక్కలను పారేస్తున్నారా.. ఈ నిజం తెలిస్తే అస్సలు వదలరు
బుధుడు తిరోగమనంతో ఆ మూడు రాశులకు ఊహించని డబ్బు.. మీ రాశి ఉందా?
బుధుడు తిరోగమనంతో ఆ మూడు రాశులకు ఊహించని డబ్బు.. మీ రాశి ఉందా?
ఆపరేషన్ థియేటర్‌లో పీజీ వైద్యవిద్యార్థిని అనుమానాస్పద మృతి
ఆపరేషన్ థియేటర్‌లో పీజీ వైద్యవిద్యార్థిని అనుమానాస్పద మృతి