AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కష్టానికి ఫలితం దక్కిందోచ్.. తవ్వకాల్లో దొరికిన అరుదైన వజ్రం.. కళ్లు చెదిరే ధర..

ఓర్పు, సహనం మనిషికి చాలా కీలకం. అవి ఉంటే.. ఏమైనా సాధించవచ్చు. అదే నిరాశ నిస్పృహలు వ్యక్తిని ముందుకు సాగనివ్వవు. ఇదే నిరూపితమైంది ఇక్కడ. వారి ఓర్పు, సహనం, ఆశ వారిని ఒక్క క్షణంలో లక్షాధికారులను చేసింది. ఇన్నాళ్లు పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆ ఒక్క క్షణంలో లభించింది. హమ్మయ్య కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందిరా అంటూ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పుడా కుటుంబ సభ్యులు. వారి నమ్మకం, విశ్వాసమే వారి సంతోషానికి కారణమైంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం..

Andhra Pradesh: కష్టానికి ఫలితం దక్కిందోచ్.. తవ్వకాల్లో దొరికిన అరుదైన వజ్రం.. కళ్లు చెదిరే ధర..
Diamond Found On Banks Of Krishna River
Shiva Prajapati
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 14, 2023 | 12:45 PM

Share

ఓర్పు, సహనం మనిషికి చాలా కీలకం. అవి ఉంటే.. ఏమైనా సాధించవచ్చు. అదే నిరాశ నిస్పృహలు వ్యక్తిని ముందుకు సాగనివ్వవు. ఇదే నిరూపితమైంది ఇక్కడ. వారి ఓర్పు, సహనం, ఆశ వారిని ఒక్క క్షణంలో లక్షాధికారులను చేసింది. ఇన్నాళ్లు పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆ ఒక్క క్షణంలో లభించింది. హమ్మయ్య కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందిరా అంటూ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పుడా కుటుంబ సభ్యులు. వారి నమ్మకం, విశ్వాసమే వారి సంతోషానికి కారణమైంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం..

ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్లలో ఓ వ్యక్తికి వజ్రం దొరికింది. ఇది అలాంటి ఇలాంటి వజ్రం కాదు. షడ్ బుజి వజ్రం లభించింది. వజ్రానికి 6 కోణాలు ఉండటంతో మాంచి డిమాండ్ వస్తోంది. సత్తెనపల్లి దగ్గర బిగుబండ గ్రామానికి చెందిన ఓ కుటుంబం గుడిమెట్లలో వజ్రాల వేగ సాగిస్తోంది. ఈ క్రమంలో వారికి షబ్ బుజి వజ్రం లభించింది. సుమారు రూ. 50 నుంచి రూ. 60 లక్షలు విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, విషయం తెలుసుకున్న వజ్రాల వ్యాపారులు రూ. 40 లక్షలు ఇస్తామంటూ బేరసారాలు చేస్తున్నారు. ఇక వజ్రాన్ని వెతికి కుటుంబ సభ్యులు మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు.

గుడిమెట్లలో వజ్రాల వేట..

కృష్ణా జిల్లా గుడిమెట్లలో ఎన్నో ఏళ్లుగా వజ్రాల వేట సాగుతుంది. పొరుగు గ్రామాల ప్రజలే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి వజ్రాల వేట సాగిస్తుంటారు జనాలు. అక్కడ వజ్రాలు బాగా ఉంటాయనే ప్రచారం ఉంది. ఆ కారణంగానే జనాలు అక్కడ వెతుకులాట సాగిస్తారు. గుడిమెట్లను గతంలో రాజులు పాలించడం, గతంలో ఇక్కడ అనేక సందర్భాల్లో వజ్రాలు దొరకడంతో వందలాది మంది వజ్రాల కోసం వెతుకుతుంటారు. ఇక ఈ మధ్య కాలంలో గుడిమెట్లకు జనాల తాకిడీ భారీగా పెరిగింది. రాష్ట్రం నలు మూలల నుంచి వచ్చి మరీ వజ్రాల కోసం వేట సాగిస్తున్నారు. రాత్రిళ్ల సమయంలో గుడిమెట్లలో నిద్రలు చేసి మరీ వజ్రాల కోసం వెతుకుతున్నారు జనాలు. చాలా మందికి వజ్రాలు దొరికాయని చెప్పడంతో భోజనాలు తెచ్చకుని మరీ వెతుకుతున్నారు. మొన్న ఒక్కరోజే మూడు వజ్రాలు దొరికాయని ప్రచారం జరుగుతుండటంతో గుడిమెట్లకు జనాల తాకిడి మరింత పెరిగింది.

గుడిమెట్ల ఒక్కటే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో వజ్రాల వేట సాగిస్తారు ప్రజలు. ముఖ్యంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ప్రజలు వజ్రాల కోసం గాలింపు చేపడుతారు. రాయలసీమ ప్రాంతంలోనూ వజ్రాలు లభిస్తాయనే ప్రచారం ఉంది. ఆయా ప్రాంతాల్లోనూ ప్రజలు వజ్రాల కోసం రేయింబవళ్లు వెతుకుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..