AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చినవెంకన్న ఆలయంలో ఇలా చేస్తారా.. మీకు కచ్చితంగా పాపం తగులుతుంది..

దేవుడి పేరుతో నకిలీ టికెట్ల దందా… చివరికి బట్టబయలైంది. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలోనే పనిచేసే సిబ్బంది సాఫ్ట్‌వేర్ సహాయంతో నకిలీ టికెట్లు ముద్రించి భక్తులకు విక్రయించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 61 నకిలీ టికెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేసి… టెక్నాలజీతో చేసిన ఈ మోసంపై పూర్తి దర్యాప్తు చేపట్టారు.

చినవెంకన్న ఆలయంలో ఇలా చేస్తారా.. మీకు కచ్చితంగా పాపం తగులుతుంది..
Fake Tickets Scam Accused
B Ravi Kumar
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 1:49 PM

Share

దేవుడు అంటే అందరికీ భయం, భక్తి ఉంటాయి. ఆలయంలో పనిచేస్తున్నవారి పట్ల గౌరవం, మర్యాదలు పాటిస్తుంటారు భక్తులు. కానీ ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో పనిచేసే సిబ్బంది ఏకంగా టికెట్స్ స్కామ్ తెరలేపారు. ఆధునిక ప్రింటింగ్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ ఉపయోగించి దేవాలయాన్నే బురిడి కొట్టించారు. కానీ ఎవరి పాపమైనా ఎన్నాళ్లు సాగుతుంది. ఫైనల్‌గా పోలీసులకు చిక్కక తప్పలేదు.

వివరాల్లోకి వెళ్తే.. ద్వారకా తిరుమల దేవస్థానంలో నకిలీ టికెట్లు విక్రయాల కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ప్రధాన నిందితులతో పాటు మరో ఆరుగురుని అరెస్ట్ చేశారు. నకిలీ టికెట్లు అమ్మడం కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను దేవస్థానం ఉద్యోగులే రూపొందించారని పోలీసులు తేల్చారు. దేవస్థానం టికెట్ కౌంటర్ల ఉద్యోగి సాయి జగన్నాథరాజు, కంప్యూటర్ సూపర్‌వైజర్ రమేష్‌లు కలిసి నకిలీ టికెట్లు తయారుకు ప్లాన్ చేశారు. తాడేపల్లిగూడెంకి చెందిన రమేష్ స్నేహితుడు ముత్యాల వెంకట సత్య శ్రీనివాసరావు సహకారంతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి దానిద్వారా నకిలీ టికెట్లు ముద్రించి కౌంటర్లో భక్తులకు విక్రయించి అక్రమంగా డబ్బు సంపాదించారు. నకిలీ టికెట్లు వ్యవహారంపై నిఘా పెట్టిన అధికారులు గత నెలలో 61 నకిలీ టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ టికెట్లు వ్యవహారంపై దేవస్థానం ఈవో భద్రాజి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈవో భద్రాజి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి స్దాయిలో దర్యాప్తు చేసి నకిలీ టికెట్లు అమ్ముతున్న అందరిని అరెస్ట్ చేశారు. నకిలీ టికెట్లు ముద్రణకు ఉపయోగించిన లాప్టాప్, ప్రింటర్, ఐదు సెల్ ఫోన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: మురుగు కాలువ కింద నుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూడగా.. చుట్టలు చుట్టలుగా.. 

Follow Us
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..