AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు బిజీ ఆర్టిస్ట్‌గా గడిపా.. రోజుకు 75,000 తీసుకునేవాడిని.. ఇప్పుడు ఆ షాప్ నడుపుకుంటున్నా..

ప్రఖ్యాత నటుడు తిరుపతి ప్రకాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మెప్పించాడు అంతే కాదు జబర్దస్త్ లాంటి కామెడీ షోలో స్కిట్స్ చేసి నవ్వులు పూయించాడు. తన సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించిన ఆయన ఆతర్వాత అవకాశాలు తగ్గడంతో ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు

ఒకప్పుడు బిజీ ఆర్టిస్ట్‌గా గడిపా.. రోజుకు 75,000 తీసుకునేవాడిని.. ఇప్పుడు ఆ షాప్ నడుపుకుంటున్నా..
Tirupati Prakash
Rajeev Rayala
|

Updated on: Nov 11, 2026 | 9:07 PM

Share

ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో, ప్రముఖ హాస్యనటుడు తిరుపతి ప్రకాష్ తన ప్రస్తుత పరిస్థితి, కెరీర్ ఎదుగుదల, ఆర్థిక ప్రణాళిక గురించి మాట్లాడారు. సినీ రంగంలో తాను రోజుకు 75,000 రూపాయల వరకు అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్నానని తిరుపతి ప్రకాష్ వెల్లడించారు. అయితే, సీరియల్స్‌లో రోజుకు 10,000 నుంచి 15,000 రూపాయల వరకు, ఎక్కువగా 25,000-30,000 రూపాయలు మాత్రమే లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాన్ని వివరిస్తూ, “నేను ఏ పని వచ్చినా చేస్తాను, నేను ఒక ఆర్టిస్ట్‌ని” అని అన్నారు. పని దొరికినప్పుడు సంతోషంగా చేస్తానని, ఖాళీగా ఉండటం తనకు ఇష్టం ఉండదని, అందుకే పని లేని రోజుల్లో తన కాఫీ షాప్‌లో కూర్చుంటానని తెలిపారు. తన షట్టర్ మూసి ఉంటే షూటింగ్‌లో ఉన్నట్లు, తెరిచి ఉంటే ఖాళీగా ఉన్నట్లు తన కస్టమర్లకు తెలుసని అన్నారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు తన కాఫీ షాప్‌ను నడుపుతానని అన్నారు, ఆదివారం కుటుంబంతో గడపడానికి షాప్ తెరవరని తెలిపారు.

గతంలో అనేక మంది హాస్యనటులు తమ చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని ప్రస్తావించినప్పుడు, తిరుపతి ప్రకాష్ తన ఆర్థిక ప్రణాళిక గురించి వివరించారు. “నేను ఒక ప్రొడ్యూసర్ నుంచి 10,000 రూపాయలు అందుకుంటే, అందులో 7,000 రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవాడిని, మిగిలిన 3,000 రూపాయలు ఇంటి ఖర్చులకు ఉంచుకునేవాడిని” అని ఆయన అన్నారు. ఈ ప్రణాళిక కారణంగా, 2000 డిసెంబర్ 6న తన వివాహం నాటికి, మోతినగర్‌లో ఒక త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్, 10 లక్షల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్, ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు తనకు ఉన్నాయని గర్వంగా చెప్పారు. అప్పట్లో 10,000 డిపాజిట్‌పై నెలవారీ 1,200 రూపాయల వడ్డీ వచ్చేదని, ఇప్పుడు అది 400 రూపాయలకు పడిపోయిందని గుర్తు చేసుకున్నారు.

తన ప్రస్తుత ఆర్థిక స్థిరత్వం గురించి మాట్లాడుతూ, బ్రాండెడ్ దుస్తులు, పర్ఫ్యూమ్‌లు మాత్రమే ఉపయోగిస్తానని తెలిపారు. మోతినగర్‌లో మూడు ఇళ్లులు ఉన్నాయని, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఇంట్లో ఉన్నప్పటికీ నెలవారీ 40,000 నుంచి 50,000 రూపాయల ఆదాయం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో సినిమా అవకాశాలు లేనప్పటికీ, తన కాఫీ షాప్ తన కుటుంబాన్ని రెండు సంవత్సరాలుగా నిలబెట్టిందని తిరుపతి ప్రకాష్ తెలిపారు. తన పొదుపులు లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లను ముట్టుకోకుండానే తన కుటుంబ పోషణ జరిగిందని, అందుకే ఆ కాఫీ షాప్ అంటే తనకు పిచ్చి అని, దాన్ని ఎప్పటికీ మూసివేయలేనని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us