ఇంటర్ చదివి డాక్టర్ అవతారమెత్తిన ఓ యువకుడి ఆటకట్టించారు విజయవాడ పోలీసులు. ఆసుపత్రులకు తిరుగుతూ డాక్టర్ అని చెప్పి రోగుల వద్ద నుంచి నగదు దోచుకుంటున్న నకిలీ డాక్టర్ అరెస్టు చేశారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన 24 ఏళ్ల ధర్మవరపు జయరాం ఇంటర్ వరకు చదివాడు. అనంతరం విశాఖపట్నంలో పలు ఆసుపత్రుల్లో కొన్నేళ్లు కాంపౌండర్ గా పనిచేశాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడటంతో జీతం సరిపోక డాక్టర్ అవతారమెత్తాడు. ఈ క్రమంలో గత నెలలో విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్లాడు. అక్కడ భాష సమస్య ఎదురవడంతో ఈ నెల 4న విజయవాడ చేరుకున్నాడు. కృష్ణలంకలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో గది తీసుకున్నాడు.
చుట్టుపక్కల ఆసుపత్రులకు వెళ్లి రోగి బంధువులకు తనని ఎనస్తీషియన్ గా పరిచయం చేసుకునేవాడు. వారి నుంచి అవసరముందని నగదు తీసుకుని అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ నెల 4 విజయవాడ చేరుకున్నాడు. కృష్ణలంకలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో గది తీసుకున్నాడు. చుట్టుపక్కల ఆసుపత్రులకు వెళ్లి రోగి బంధువులకు తనని ఎనస్తీషియన్ పరిచయం చేసుకునేవాడు. వారి నుంచి అవసరముందని నగదు తీసుకుని అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ నెల 4న ఆంధ్ర ఆసుపత్రిలో రూ.7500, 5న విజయ ఆసుపత్రిలో రూ.10 వేలు, 7న గుంటూరు ఆసుపత్రిలో రూ.10 వేలు, సాయంత్రం అమెరికా ఆసుపత్రిలో రూ.4 వేలు తీసుకుని ఇదే తరహా మోసానికి పాల్పడ్డాడు. దీనిపై ఆయా ఆసుపత్రుల నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని ఆదివారం ఉదయం వారధి వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..