Vijayawada: విజయవాడలో నకిలీ పోలీసు హల్‌చల్.. విచారణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు..

Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నకిలీ పోలీసు కలకం రేగింది. పోలీసు దుస్తులు ధరించి హల్‌చల్ చేస్తున్న యువకుడిని నున్న పోలీసులు

Vijayawada: విజయవాడలో నకిలీ పోలీసు హల్‌చల్.. విచారణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Fake Constable

Updated on: Aug 01, 2021 | 9:11 PM

Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నకిలీ పోలీసు కలకం రేగింది. పోలీసు దుస్తులు ధరించి హల్‌చల్ చేస్తున్న యువకుడిని నున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ యువకుడిని విచారించగా.. ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. అతని చెప్పిన మాటలు విని పోలీసులు షాక్ అయ్యారు. ఈ ఫేక్ పోలీసుకు సంబంధిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన పృధ్వీరాజ్ పోలీసు ఉద్యోగానికి ప్రయత్నించాడు. అయితే, ఆ ప్రయత్నంలో అతను విఫలమయ్యాడు. విషయం ఇంట్లో తెలిస్తే తల్లి బాధపడుతుందని పృధ్విరాజ్ భావించాడు. ఈ నేపథ్యంలో అసలు విషయం ఇంట్లో తెలియకుండా.. తన తల్లికి తాను కానిస్టేబుల్‌ని అని చెప్పుకున్నాడు. పృధ్విరాజ్ చెప్పిన విషయాన్ని అతని తల్లి నమ్మింది.

ఇంట్లో కానిస్టేబుల్‌గా నటిస్తూ.. బయట ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు పృధ్విరాజ్. విజయవాడలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న పృధ్విరాజ్.. రోజూలాగా ఇంటికి వెళ్లే ముందు కానిస్టేబుల్ డ్రెస్ వేసుకుని బయలుదేరాడు. ఈ క్రమంలో నున్న పోలీసులు అతన్ని అడ్డుకుని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగు చూసింది. తన తల్లి ఆనందం కోసం కానిస్టేబుల్‌లా నటిస్తున్నానంటూ పృధ్విరాజ్.. పోలీసులకు తెలియజేశాడు. అయితే, పోలీసులా చెలామణి అవుతున్న పృధ్విరాజ్‌పై నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also read:

Sindhu Father: సింధు ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ : సీఎం జగన్ ఫోన్ చేసి గెలవాలన్నారు.. తెలుగు రాష్ట్రాల సీఎంల సహకారానికి ధన్యవాదాలు

Greenland Melting: కరిగిపోతున్న ప్రపంచంలోని అతిపెద్ద మంచు ఖండం గ్రీన్‌లాండ్ తాజాగా ద్రవీభవించిన అతిపెద్ద మంచుముక్క..

Bicycle Journey: కేరళ టూ కాశ్మీర్ ఓ యువతి సైకిల్ పై యాత్ర.. యువతకు స్వేచ్ఛ ఇవ్వాలంటున్న తండ్రి