AP Crime News: అభివృద్ధి వైపు సమాజం పరుగులు పెడుతున్నా.. టెక్నాలజీ మనిషిని శాసిస్తోందని గగ్గోలు పెట్టినా.. కొందరు అమాయకులు ఇప్పటికీ దొంగబాబాలను(Fake Baba) నమ్ముతూనే ఉన్నారు. వారి మాయమాటలు నమ్మి నట్టేట మునుగుతున్నారు. ఫలితంగా కోట్ల రూపాయలు మోసపోతున్నారు. దోపిడీ, మోసాల్లో బాబాల స్టైలే వేరు. ఒకరు తాయత్తుల పేరుతో దోచేస్తే.. ఇంకోడు చీటీల పేరుతో ముంచేస్తాడు. ఎలా చేస్తేనేం దొంగబాబాల అంతిమ లక్ష్యం దోచుకోవడం – పారిపోవడమేనని మరోసారి నిరూపితమైంది. చిత్తూరు(Chittoor) జిల్లాలో చీటీల పేరుతో మహిళా భక్తులకు ఓ బాబా కుచ్చుటోపీ పెట్టాడు. బాధితుల నుంచి 25 కోట్ల రూపాయలు వసూలు చేసి, ఫ్యామిలీతో సహా ఉడాయించాడు. బాధితులు టీవీ9 ను ఆశ్రయించడంతో దొంగబాబా లీలలు బయట పడ్డాయి. జిల్లాలోని బంగారుపాళ్యంలో(Bangarupalyam) ఆంజనేయులు అలియాస్ సాయినాథ్ అనే స్వామీజీ.. 15 ఏళ్ల క్రితం బాపట్ల నుంచి వచ్చి నివాసం ఉంటున్నాడు. గ్రామంలో ఓంశక్తి ఆలయాన్ని నిర్మించి స్థానికులతో నమ్మకంగా ఉన్నాడు. స్వామీజీని నిండా నమ్మిన మహిళా భక్తులు సాయినాథ్ దగ్గర చీటీలు వేశారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 కోట్ల రూపాయలు వసూలు చేసిన సాయినాథ్ నెల క్రితం భార్యాపిల్లలలో సహా ఉడాయించాడు. నెలరోజులైనా సాయినాథ్ కనిపించకపోవడంతో మోసపోయామని గ్రహించారు. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు సాయినాథ్ అలియాస్ ఆంజనేయులును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.
Also Read
Andhra Pradesh: ఏపీ మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన.. వారికి ఆర్టీసీ బస్సుల్లో రాయితీ
SI Suspend: ఎస్సై పై సస్పెన్షన్ వేటు.. మృతుడి బంధువుల ఆరోపణలతో ఉన్నతాధికారుల చర్యలు
Holi 2022: ఈ అందమైన ప్రాంతాలను సందర్శించి హోలీని మరింత రంగుల మయం చేసుకోండి..