Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు (జూన్ 17) విడుదలయ్యే అవకాశాలున్నాయంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ విషయంపై పూర్తి క్లారిటీ లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఇదే విషయంపై సమాచారం కోసం ఇంటర్ బోర్డ్ సెక్రటరీని సంప్రదించింది టీవీ9. ఆయన ఈ రోజే రిజల్ట్స్ అనే వార్తలను కొట్టి పారేశారు. ఇంకా వాల్యూవేషన్ ప్రాసెస్ జరుగుతుందని.. ఈ నెల 25 తర్వాతే ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు. అయితే ఈ ఇంటర్ పరీక్షలను మే 6నుంచి 24 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 4,64,756 మంది ఇంటర్ స్టూడెండ్స్ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు వచ్చాక విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డ్స్ అందిస్తారు. ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు https://bie.ap.gov.in/ వెబ్‌సైట్ల ద్వారా ద్వారా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో 33 కంటే ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటుంది. 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్ షిప్స్‌కు ఎలిజిబుల్ అవుతారు.
మరిన్ని ఆంధ్రపదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..