స్నేహితుల కోసం మాజీ సైనికుడి నిర్వాకం.. మద్యం మత్తులో ఏం చేశాడంటే..
చిత్తూరులో తుపాకీ కాల్పులు కలకలం రేపింది. నందిని బార్లో స్నేహితులతో కలిసి మద్యం సేవించిన మల్లికార్జున అనే మాజీ సైనికుడు పిస్టల్ తో కాల్పులకు పాల్పడ్డాడు. మల్లికార్జున వద్ద ఉన్న తుపాకీ డూప్లికేట్ అని ఎగతాళి చేసిన స్నేహితులకు రియాల్టీ షో చూపించాడు. మద్యం మత్తులో ఆవేశానికి గురై కాల్పులు జరిపాడు మల్లికార్జున.
చిత్తూరులో తుపాకీ కాల్పులు కలకలం రేపింది. నందిని బార్లో స్నేహితులతో కలిసి మద్యం సేవించిన మల్లికార్జున అనే మాజీ సైనికుడు పిస్టల్ తో కాల్పులకు పాల్పడ్డాడు. మల్లికార్జున వద్ద ఉన్న తుపాకీ డూప్లికేట్ అని ఎగతాళి చేసిన స్నేహితులకు రియాల్టీ షో చూపించాడు. మద్యం మత్తులో ఆవేశానికి గురై కాల్పులు జరిపాడు మల్లికార్జున. కాల్పుల శబ్దంతో ఒక్కసారిగా స్థానికులు పరుగులు పెట్టడంతో బార్లో గందరగోళం నెలకొంది. ఎక్కడా తగ్గకుండా అదే స్పీడ్లో కాల్పులు జరిపిన మల్లికార్జున స్కూటర్పైకెక్కి ఉడాయించాడు. ఈ ఘటనపై నందిని బార్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేపట్టారు. కాల్పులకు పాల్పబడిన మల్లికార్జునను అరెస్టు చేసారు.
మల్లికార్జున 2001లో భారత సైన్యం నుంచి రిటైర్డ్ అయినట్లు గుర్తించిన పోలీసులు.. భారత సైన్యంలో రిటైర్డ్ అయిన సమయంలో తుపాకీ లైసెన్స్ పొందినట్లు గుర్తించారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీ పాయింట్ 32 ఫిస్టల్గా గుర్తించిన పోలీసులు కాల్పుల సమయంలో ఒక రౌండ్ నేలపైకి కాల్చినట్లుగా నిర్ధారించారు. మల్లికార్జున వద్ద నుండి పాయింట్ 32 ఫిస్టల్ తో పాటు బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సీజ్ చేసిన ఫిస్టల్ను ఎఫ్ఎస్ఎల్కు పంపారు. మల్లికార్జున వాడిన పిస్థోల్ క్రిస్టల్ కంట్రీ మేడ్ పిస్తోలా లేక కంపెనీదా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..