Andhra Pradesh: ‘గుడివాడ‌కు అసలు ఎమ్మెల్యే ఉన్నాడా..?’.. కొడాలి నాని, వైసీపీ పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు..

|

Apr 14, 2023 | 7:34 AM

కృష్ణా జిల్లాలో తన 3 రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి గుడివాడలో పర్యటించిన ఆయన ‘ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ తుడుచుపెట్టుకుపోవడం..

Andhra Pradesh: ‘గుడివాడ‌కు అసలు ఎమ్మెల్యే ఉన్నాడా..?’.. కొడాలి నాని, వైసీపీ పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు..
Chandra Babu On Kodali Nani And Ycp
Follow us on

ఆంధ్రప్రదేశ్‌‌లోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అంటూనే కొడాలి నానిపై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కృష్ణా జిల్లాలో తన 3 రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి గుడివాడలో పర్యటించిన ఆయన ‘ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ తుడుచుపెట్టుకుపోవడం ఖాయం. నాలుగేళ్లుగా ఎలాంటి అనుభవం లేని సీఎం ఉన్నాడు. తెలుగు తమ్ముళ్లు నోరు తెరిస్తే వాళ్లు పారిపోతారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టాం.. చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. బూతులు మాట్లాడే స్థాయికి టీడీపీ దిగజారదు. రౌడీయిజం చేయదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆకాశంలో విర్రవీగుతున్న సీఎంను కిందకి దించాం. పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగురవేసేసరికి వైసీపీకి దిమ్మ తిరిగింద’ని అన్నారు.

ఇంకా ‘వారికి మూడు రాజధానులు కావాలంట. మూడు ముక్కలాట ఆడించేవాడిని తరిమి కొట్టాల్సిన బాధ్యత మీకు ఉంది. నాలుగేళ్లలో 2లక్షల 10 వేల కోట్లు అవినీతికి సీఎం పాల్పడ్డారు. కోడి కత్తి కేసులో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని NIA చెప్పింది. బాబాయ్ ని చంపి నెపం మాపై వేయాలని చూసారు’ అంటూ వైసీపీని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అలాగే వైసీపీ పాలనపై కూడా తనదైన శైలిలో విమర్శించారాయన. ‘ప్రత్యేక హోదా ఏమైంది..? పొలవరాన్ని ముంచేశారు. విశాఖ రైల్వే జోన్,నిధుల గురించి అడగడం లేదు. స్థానిక ఎమ్మెల్యే పేకాట క్లబ్బులు పెడుతున్నాడు. మా పాలనలోనే గుడివాడలో 8912 TIDCO ఇళ్లు 90 శాతం పూర్తి చేస్తే మిగిలింది చేయలేకపోయారు వైసీపీ పాలకులు. గుడివాడ‌కు అసలు ఎమ్మెల్యే ఉన్నాడా..? మట్టి మాఫియా, దేవుడి భూములు అక్రమించేశారు నా మీద కేసులు పెట్టి ఏం సాధిస్తారు..?’ అంటూ అధికార పార్టీపై ధ్వజమెత్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..