మూడు రాజధానుల అంశంలో మళ్లీ కదలిక.. ఆర్థిక బుగ్గన కామెంట్స్‌తో కొత్త చర్చ.. కర్నూలు జగన్నాధగట్టులో హైకోర్టు నిర్మాణం

|

Mar 09, 2021 | 9:10 PM

AP Judicial Capital: జగన్నాథగట్టు... ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న పేరు. జ్యుడీషియల్ క్యాపిటల్‌పై బుగ్గన కీలక వ్యాఖ్యలతో ఆ స్థలంపై ఒక్కసారిగా అందరి ఫోకస్ పడింది. మూడు...

మూడు రాజధానుల అంశంలో మళ్లీ కదలిక.. ఆర్థిక బుగ్గన కామెంట్స్‌తో కొత్త చర్చ.. కర్నూలు జగన్నాధగట్టులో హైకోర్టు నిర్మాణం
Andhra Pradesh Judicial Capital Jagannatha Gattu
Follow us on

Andhra Pradesh Judicial Capital: జగన్నాథగట్టు… ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న పేరు. జ్యుడీషియల్ క్యాపిటల్‌పై బుగ్గన కీలక వ్యాఖ్యలతో ఆ స్థలంపై ఒక్కసారిగా అందరి ఫోకస్ పడింది. మూడు రాజధానులపై మరోసారి కదలిక ఏర్పడింది. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది…. అక్కడే ఎందుకు న్యాయరాజధాని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది..?

మూడు రాజధానులపై మూమెంట్‌ మొదలైంది. కర్నూలును జ్యుడీషియల్ కేపిటల్‌గా మారుస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తున్నట్టు స్పష్టమైంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. కర్నూలులోని జగన్నాథ గట్టు వద్ద 250 ఎకరాల్లో నిర్మిస్తామని ఆయన చెప్పడంతో అందరి దృష్టి ఈ గుట్టపై పడింది. ప్రభుత్వం తరఫున వచ్చిన అధికారిక ప్రకటనగానే దీన్ని భావించవచ్చు.

హైకోర్టు భవనాలను ఎక్కడ నిర్మించాలని భావిస్తున్నది మొదటిసారిగా వెల్లడించారు రాజేంద్రనాథ్‌. దీంతో ఈ జగన్నాథగట్టు ఎక్కడుందన్న చర్చ మొదలైంది. కర్నూలు బస్టాండ్‌కు 10.7 కిలోమీటర్ల దూరంలో ఉందీ ప్రదేశం. సుమారు 30 నిమిషాల్లో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. కర్నూలు రైల్వేస్టేషన్ నుంచి కూడా సుమారు ఇది అంతే దూరంలో ఉంది. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే సుమారు ముఫ్పై ఐదు నిమిషాల సమయం పడుతుంది. అంటే ఏ మార్గంలో ఈ జగన్నాథగట్టుకు చేరుకోవాలన్నా సరే సుమారు 25 నుంచి 35 నిమిషాల మధ్య సమయం పడుతుంది.

జగన్నాథగట్టు హైవే పక్కనే ఉన్నందున ఇప్పటికే నిర్మాణాలు ఊపందుకున్నాయి. చాలా ఏళ్ల క్రితమే… కర్నూలు వరద బాధితుల కోసం టీవీ9 భవనాలు నిర్మించి ఇచ్చింది. తర్వాత ఇల్లు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం కూడా టిడ్కోలు ఇళ్లను అదే ప్రాంతంలో కట్టించింది. దీంతో అక్కడ ఇతర నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

జగన్నాథగట్టుపై ఆర్థిక మంత్రి బుగ్గన కామెంట్స్‌తో త్వరలోనే ప్రక్రియ మొదలవుతుందని తెలుస్తోంది. వ్యవహారం హైకోర్టులో ఉండటంతో అక్కడ క్లియరెన్స్‌ రాగానే… పనులు స్టార్ట్‌ అవుతాయని అర్థమవుతోంది. కర్నూలులో హైకోర్టుకు ప్లేస్‌ కూడా డిసైడైపోయింది. గ్రీన్‌సిగ్నల్‌ రాగానే అక్కడ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయనేది ఆర్థిక మంత్రి బుగ్గన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.

2019 డిసెంబర్‌లోనే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందింది. మండలిలో అడ్డుకోవడం, ఆ తర్వాత వ్యవహారం హైకోర్టుకు వెళ్లడం జరిగాయి. 3 నెలల తర్వాత మళ్లీ అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే ఇప్పటికీ హైకోర్టు నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. దీనిపై రాష్ట్రం, హైకోర్టు కలిసి నిర్ణయం తీసుకోవాలని కేంద్రం తేల్చి చెప్పింది. ఇప్పుడు దీనిపై బుగ్గన చేసిన కామెంట్స్‌తో త్వరలోనే ప్రక్రియ ఉంటుందా అనే కొత్త చర్చ ఊపందుకుంది.

ఇవి కూడా చదవండి..

ఈ ఇంటి ఖరీదు రూ. 6.5 కోట్లు … కానీ బాత్రూమ్‌కు డోర్ లేదు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..
AP Municipal Elections 2021: ఏపీ మున్సిపోల్స్‌లో ఆఖరి ఘట్టం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం..
1000 రూపాయలకు అల్లం, 30 రూపాయలకు గుడ్డు, పాకిస్తాన్‌ ‘వంటగది’లో ద్రవ్యోల్బణం సెగ…