
అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక అనగానే హస్త కళాకారులకు ప్రసిద్ధి. అంకుడు కర్రతో వివిధ రకాల కళారూపాలు తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడి బొమ్మలు దేశ విదేశాల్లో ప్రాచూర్యం పొందాయి. మోడీ మనసును సైతం మెప్పించాయి. అయితే.. ఓ కళాకారుడు స్వతంత్ర దినోత్సవం వేళ తన ప్రతిభకు పదును పెట్టాడు. అంకుడు కర్ర సహాయంతో సహజ సిద్ధ రంగుల మేళవింపుతో దేశ సమైక్యతను చాటుకునేలా జాతీయ పతాకమును, ప్రతిష్టాత్మక యుద్ధ విమానాలను రూపొందించాడు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ జాతీయ పతాకాన్ని యుద్ధ విమానాలను రూపొందించానని అంటున్నాడు హస్త కళాకారుడు గుత్తి వాసు.
బీఈడీ వరకు చదువుకున్న వాసు.. చిన్నతనం నుంచే హస్తకళావృత్తి పైనే జీవించే తన తండ్రి సూరిబాబు వద్ద కళారూపాల తయారీ ని నేర్చుకున్నాడు. చదువుతోపాటు హస్తకళలు తయారు చేయడం చిన్నతనం నుంచే అలవర్చుకున్నాడు.
అయితే.. ఈ అలా రూపాలను తయారు చేసేందుకు వారం రోజులపాటు శ్రమించాడు. జాతీయ పతాకాన్ని తయారు చేయడంతో పాటు శాంతిక చిహ్నంగా నిలిచేలా రెండు పావురాలను ఏర్పాటు చేసి జాతీయ పతాకాన్ని రూపొందించాడు. అలాగే రాఫెల్ యుద్ధ విమానం, క్షిపణి అందంగా తీర్చిదిద్దాడు. అంకుడు కర్ర ఉపయోగించి రూపొందించిన ఈ హస్త కళాఖండాలను అవకాశం ఉంటే ప్రధాని దృష్టికి తీసుకెళ్తానంటున్నాడు.
Vasu