Andhra Pradesh: వడ్డీ వ్యాపారులను మించిపోయిన విద్యా సంస్థ.. స్కూల్ ఫీజు ఆలస్యం అయితే వడ్డీతో సహా చెల్లించాల్సిందేనట..!

| Edited By: Shiva Prajapati

Jul 23, 2023 | 11:48 AM

విద్యను వ్యాపారంగా చేస్తూ.. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఎన్ని ప్రైవేటు స్కూళ్ళను చూసి ఉంటారు. కానీ అనంతపురంలోని ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం మిగతా స్కూళ్ళ కంటే ఒక ఆకు ఎక్కువే చదివినట్లుంది. అసలే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఆ విద్యా సంస్థ.. ఫీజు ఆలస్యం అయితే.

Andhra Pradesh: వడ్డీ వ్యాపారులను మించిపోయిన విద్యా సంస్థ.. స్కూల్ ఫీజు ఆలస్యం అయితే వడ్డీతో సహా చెల్లించాల్సిందేనట..!
Anantapur Era International School
Follow us on

విద్యను వ్యాపారంగా చేస్తూ.. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఎన్ని ప్రైవేటు స్కూళ్ళను చూసి ఉంటారు. కానీ అనంతపురంలోని ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం మిగతా స్కూళ్ళ కంటే ఒక ఆకు ఎక్కువే చదివినట్లుంది. అసలే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఆ విద్యా సంస్థ.. ఫీజు ఆలస్యం అయితే. వడ్డీతో సహా చెల్లించాలని నిబంధన విధించింది. ఇద ఆ విద్యా సంస్థ వ్యాపార ధోరణిని తెలియజేస్తుంది. అనంతపురం పట్టణంలోని ఎరా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వాకం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చేసేది తప్పుడు పని అయితే.. ఎవరైనా గుట్టుచప్పుడు కాకుండా చేస్తారు. కానీ ఎరా ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం మాత్రం పబ్లిక్ గానే చేస్తుంది. స్కూల్ ఫీజులపై వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించింది. స్కూల్ ఫీజు చెల్లించడంలో ఎవరైనా ఆలస్యం చేస్తే.. 18 శాతం వడ్డీతో స్కూల్ ఫీజు చెల్లించాలని స్కూల్ అడ్మిషన్ ఫాం పై నిబంధనల్లో ప్రచురించింది.

అది చూసిన జనాలు మరీ ఇంత బరి తెగింపా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే లక్షల్లో ఫీజులు కట్టలేక.. విద్యార్దుల తల్లిదండ్రులు అవస్థలు పడుతుంటే. ఇలాంటి స్కూళ్ల దోపిడి వారి జీవితాలను మరింత అగాథంలోకి నెట్టేస్తుంది. పిల్లల భవిష్యత్ కోసం రూపాయి రూపాయి కూడబెట్టి ఏదోలా ఫీజు కడదామంటే.. ఫీజు కాస్తా ఆలస్యమైనా వడ్డీతో సహా కట్టాలని స్కూల్ యాజమాన్యం నిబంధన విదించడంతో పేరెంట్స్‌ను మరింత కలవరానికి గురి చేస్తుంది. ఇది దారుణాతి దారుణం అని మండిపడుతున్నారు. పిల్లల భవిష్యత్ కోసం ఎంత ఫీజు అయినా చెల్లించాలి అనుకునే మధ్య తరగతి పేరెంట్స్ ఆశలే ఎరా ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి కాసులు కురిపిస్తుంది.

ఇక ఫీజు ఆలస్యం అయితే 18 శాతం వడ్డీతో సహా వసూలు చేయాలని నిర్ణయించిన స్కూల్ యాజమాన్యం నిర్వాకంపై విద్యార్ది సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్ళలో అధిక ఫీజుల వసూళ్ళపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎరా ఇంటర్నేషనల్ స్కూల్ ముందు విద్యార్ది సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఎరా ఇంటర్నేషనల్ స్కూల్ ఒక విద్యా సంస్థనా? లేక వడ్డీ వ్యాపార సంస్థనా? అని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..