Andhra Pradesh: అంతులేని విషాదాం..! గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబమంతా మృతి

| Edited By: Srilakshmi C

Nov 30, 2023 | 11:31 AM

విశాఖ మధురవాడ వాంబే కాలనీలో బాలరాజు తన భార్య చిన్ని ఇద్దరు కొడుకులతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కార్పెంటర్గా పనిచేసే బాలరాజు.. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ఇద్దరు పిల్లలను చదివించాడు. గిరి, కార్తీక్‌లు కూడా చేతికి అందివచ్చారు. తండ్రి కొడుకులు మాలధారణ చేశారు. దీక్షలో ఉన్నారు. నవంబరు 24వ తేదీ తెల్లవారుజామున అంతా నిద్రలేచి, పూజ కోసం సిద్ధమవుతున్నారు. అదే సమయంలో వంట గ్యాస్ అయిపోవడంతో భార్య తన భర్త బాలరాజుకు చెప్పింది. దీంతో మరో సిలిండర్..

Andhra Pradesh: అంతులేని విషాదాం..! గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబమంతా మృతి
Gas Cylinder Explosion
Follow us on

విశాఖ, నవంబర్‌ 30: అదో పేద కుటుంబం. దంపతులు వారికి ఇద్దరు చేతికి అంది వచ్చిన కొడుకులు, ఉన్నదాంట్లో అన్యోన్యంగా జీవనం సాగిస్తూ అందరితో కలివిడితనంతో, పచ్చగా సాగుతున్న వారి జీవితాల్లో విధి పగబట్టింది. అగ్ని ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.. ఒకరి తరువాత ఒకరు ఊపిరి వదిలారు. దీంతో ఆ కాలనీలో విషాదం నెలకొంది. ఈ ఘటన అందరినీ కలచివేసింది.

విశాఖ మధురవాడ వాంబే కాలనీలో బాలరాజు తన భార్య చిన్ని ఇద్దరు కొడుకులతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కార్పెంటర్గా పనిచేసే బాలరాజు.. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ఇద్దరు పిల్లలను చదివించాడు. గిరి, కార్తీక్‌లు కూడా చేతికి అందివచ్చారు. తండ్రి కొడుకులు మాలధారణ చేశారు. దీక్షలో ఉన్నారు. నవంబరు 24వ తేదీ తెల్లవారుజామున అంతా నిద్రలేచి, పూజ కోసం సిద్ధమవుతున్నారు. అదే సమయంలో వంట గ్యాస్ అయిపోవడంతో భార్య తన భర్త బాలరాజుకు చెప్పింది. దీంతో మరో సిలిండర్ అమర్చి దానికి రెగ్యులేటర్ పెట్టారు. మరోవైపు ఇద్దరు కొడుకుల్లో ఒకరు పూజ కోసం దీపాన్ని సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఏమైందో ఏమో కానీ.. దీపం వెలిగించగానే దట్టమైన పొగలు ఆ ఇంట్లో కమ్మేసాయి. ఇంట్లో మంటలు చెలరేగాయి. ఇంటి నుంచి తెల్లవారుజామున అరుపులు కేకలు వినిపించాయి. ఇరుగుపొరుగువారు హుటాహుటిన అక్కడకు చేరుకొని.. మంటల్లో చిక్కుకున్న నలుగురిని బయటకు తీశారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో ఆసుపత్రికి తరలించారు. గాయపడిన బాలరాజు అతని భార్య చిన్నితో పాటు ఇద్దరు కొడుకులను ఆసుపత్రికి తరలించారు.

ఒకరి తరువాత ఒకరు..

అగ్ని ప్రమాదంలో దాదాపు 30 నుంచి 40 శాతం వరకు గాయపడ్డారు. వారందరినీ కేజీహెచ్ కు తరలించి చికిత్స అందించారు. కానీ చికిత్స పొందుతూ మూడో రోజుకు.. ఇద్దరు కుమారుల్లో ఒకడు ప్రణాలు కోల్పోయారు. దీంతో స్థానికులు ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ విషాదం నుంచి కోలుకొక ముందే.. అమరుసటి రోజే మరో కొడుకు కూడా ఆసుపత్రిలో మృతి చెందాడు. దీంతో చేతికి అంది వచ్చిన కొడుకులు గిరి (23), కార్తీక్ (21) ప్రాణాలు కోల్పోవడంతో .. ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఆ తర్వాత గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజు, అతని భార్య చిన్ని ఇద్దరూ ఊపిరి వదిలేసారు.

ఇవి కూడా చదవండి

అన్నీ తామై స్థానికులే అంత్యక్రియలు చేసి..

రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కాలనీలో విషాదం అలముకుంది. బాలరాజు స్వస్థలం ఆనందపురం గ్రామం అయినప్పటికీ.. ఉపాధి కోసం చాలా కాలం కిందటే నగరానికి వచ్చారు. దూరపు బంధువులు ఉన్నప్పటికీ బాలరాజు కుటుంబం అనాధలుగా మారకూడదని అన్ని తామై స్థానికులే అంత్యక్రియలు చేశారు.

అదే కారణమైంది..

నలుగురి ప్రాణాలు తీసేందుకు కారణమైన అగ్నిప్రమాదం గ్యాస్ లీక్ వల్లే జరిగినట్టు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. ఖాళీ అయిన సిలిండర్ మార్చి ఫుల్ గా ఉన్న సిలిండర్ కు రెగ్యులేటర్ పెట్టె క్రమంలో, గ్యాస్ లీకై .. వాయువు ఇల్లంతా వ్యాపించింది. దీపం వెలిగించడంతో గ్యాస్‌కు అంటుకొని మంటలు వ్యాపించినట్టు గుర్తించారు. దీనిపై పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.