రాష్ట్రవ్యాప్తంగా మూడు జిల్లాలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో నేడు రీ-పోలింగ్ జరగనుంది. సదరు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని (కేశనుపల్లి, నల్లచెరువు, కలనూతల, ఇసుకపాలెం, అటకానితిప్ప) ఐదు కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రీ పోలింగ్ జరగనుంది.