AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడమర గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ పడమర గాలుల కారణంగా ఏపీలో రాగల మూడు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని, పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ మేరకు రాగల మూడు రోజులకు సంబంధించి వాతావరణ పరిస్థితులపై నివేదికను అధికారులు విడుదల చేశారు. దీని ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు.
దక్షిణ కోస్తాంధ్రాలో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి వర్షాలు పలు చోట్లు కురుస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. వర్షాలు కురిసే ప్రాంతాల్లోని ప్రజలు అలర్ట్‌గా ఉండాలని, పలు చోట్ల పిడుగుల పడే ఛాన్స్ ఉన్నందున సురక్షితమైన ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు.
Also read:
East Godavari: కుటుంబం అదృశ్యం… అక్కడ కనిపించిన బైక్, దుస్తులు.. అంతా మిస్టరీ
Telangana Congress: కాంగ్రెస్ లో దళిత దండోరా లొల్లి.. ప్రధాన చర్చ రేవంత్ తీరుపైనే.. ఎందుకంటే..