AP CM Jagan: రోడ్లు గుంతలతో నిండి ఉన్నాయని.. రహదారిపై ప్రయాణించే ప్రయాణీకులకు ఇబ్బందులు పడుతున్నారని.. తరచుగా యాక్సిడెంట్స్ అవుతున్నాయని.. తక్షణమే రోడ్లు మరమ్మతుకు చర్యలు తీసుకోవాలని ఓ గ్రామ సర్పంచ్ వినతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. వెంటనే అధికారులు రహదారి మరమ్మత్తులను చేపట్టారు.. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే
పి.గన్నవరం మండలంలోని గంటి పెదపూడి నుంచి గన్నవరం వరకు రోడ్లు వేయాలని బెల్లంపూడి సర్పంచ్ బండి మహాలక్ష్మి కోరారు. ఈ మార్గంలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.. గుంతలతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని సర్పంచ్ మహాలక్ష్మి.. సీఎం జగన్ కు లేఖ రాశారు. ఈ ఉత్తరం సీఎం దృష్టికి చేరుకుంది. వెంటనే సీఎం ఓ కార్యాలయం ఈ ఉత్తరపై స్పందించింది. రోడ్ల మరమ్మత్తులకు కావాల్సిన నిధులను రిలీజ్ చేసింది. దీంతో పి.గన్నవరం నుండి గంటి పెద పూడి వరకు వెళ్లే రహదారి మరమ్మతులను అధికారులు చేపట్టారు. అంతేకాదు త్వరలోనే టెండర్లు వేసి రోడ్లు నిర్మిస్తామని సర్పంచ్ మహాలక్ష్మికి అధికారులు తెలిపారు.
Actor Suman: దక్షిణాది సీనియర్ నటుడు యాక్షన్ స్టార్ సుమన్ పుట్టిన రోజు నేడు..