Dussehra Holidays: ఏపీలో 9 రోజుల పాటు దసరా సెలవులు.. ఎప్పటి నుంచి అంటే..

AP Dussehra Holidays: గతేడాదితో పోల్చితే ఈసారి దసరా ముందుగానే వచ్చింది. గతేడాదిలో దసరా పండగ అక్టోబర్ 12వ తేదీ రాగా, ఈసారి మాత్రం అక్టోబర్ 2వ తేదీనే వచ్చింది. అందుకే ఈసారి ముందుగానే సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పుడు..

Dussehra Holidays: ఏపీలో 9 రోజుల పాటు దసరా సెలవులు.. ఎప్పటి నుంచి అంటే..

Updated on: Sep 09, 2025 | 6:00 AM

Dussehra Holidays: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు శుభవార్త. దసరా పండుగ కోసం రాష్ట్రంలోని పాఠశాలలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2, 2025 వరకు 9 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఈ సుదీర్ఘ విరామం విద్యార్థులకు కుటుంబంతో కలిసి జరుపుకోవడానికి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి, పండుగ సీజన్‌ను ఆస్వాదించవచ్చు.

ఈ దసరా పండగ అక్టోబర్ 2, 2025 న వస్తుంది. చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలు అక్టోబర్ 3న తెరుచుకోనున్నాయి.

ఇది కూడా చదవండి: Metro Station: మెట్రో స్టేషన్‌లోకి అతిపెద్ద అరుదైన బల్లి.. హడలిపోయిన ప్రయాణికులు

ఇవి కూడా చదవండి

విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇస్తారు. వీరికి మొత్తం 6 రోజులు దసరా సెలవులు ఉంటాయి.

ఇది కూడా చదవండి: Cockroach: మీ ఇంట్లో బొద్దింకలు పెరిగిపోతున్నాయా? ఈ ట్రిక్స్‌ పాటిస్తే అస్సలు ఉండవు!

గతేడాదితో పోల్చితే ఈసారి దసరా ముందుగానే వచ్చింది. గతేడాదిలో దసరా పండగ అక్టోబర్ 12వ తేదీ రాగా, ఈసారి మాత్రం అక్టోబర్ 2వ తేదీనే వచ్చింది. అందుకే ఈసారి ముందుగానే సెలవులు ప్రారంభం కానున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి