రైలు పట్టాలపై పడుకున్న యువకుడు.. అంతలోనే దూసుకొచ్చిన గూడ్స్ రైలు.. చివరకు..
అనకాపల్లి జిల్లా నాగరాజుపేట రైల్వే గేట్ సమీపంలో రైల్వే పట్టాలపై పడుకున్న ఓ యువకుడు గూడ్స్ రైలు దూసుకొస్తుండగా క్షణాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గేట్ కీపర్ అప్రమత్తం కావడం, స్థానికులు వెంటనే స్పందించి యువకుడిని హెచ్చరించడంతో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన యువకుడు రైల్వే పోలీసులు వచ్చేలోపే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అది అనకాపల్లి జిల్లా నాగరాజు పేట రైల్వే గేటు ప్రాంతం.. ఓ యువకుడికి ఏమైందో ఏమో గాని పట్టాలపైకి వెళ్ళాడు.. రైల్వే ట్రాక్ పై అడ్డంగా పడుకున్నాడు. అదే పట్టాలపై గూడ్స్ రైలు వస్తోంది. విషయాన్ని రైల్వే గేట్ కీపర్ గుర్తించారు. లోకో పైలట్ను అప్రమత్తం చేశారు. రైలు వేగం తగ్గింది. కేకలు కొట్టారు రాళ్లు విసిరారు. వెంటనే ఆ యువకుడు పట్టాల నుంచి పక్కకు తప్పుకున్నాడు. క్షణం ఆలస్యమైన ఆ యువకుడు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట సమీపంలోని నాగరాజు పేట రైల్వే గేటుకు సమీపంలో ఈ ఘటన జరిగింది. పాయకరావుపేట – తుని రైల్వే స్టేషన్లో మధ్య నాగరాజు పేట రైల్వే గేట్. అనకాపల్లి నుంచి తుని వైపు వెళ్లే రైల్వే ట్రాక్పై ఓ యువకుడు పట్టాల పైకి వెళ్ళిపోయాడు. రాకపై అడ్డంగా పడుకున్నాడు. ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాడని గుర్తించే లోగానే.. గూడ్స్ రైలు అదే పట్టాల పైకి వస్తోంది. విషయాన్ని గుర్తించి రైల్వే గేట్ కీపర్.. సమీప రైల్వే స్టేషన్కు సమాచారం అందించారు. గూడ్స్ రైలు లోకో పైలట్ కు అధికారులు అప్రమత్తం చేయడంతో రైలు వేగం తగ్గించారు.
ఈలోగా ఇద్దరు స్థానికులు గట్టిగా కేకలు వేస్తూ పట్టాల వైపు పరుగులు పెట్టారు. పట్టాలపై పడుకున్నప్పుడు పైకి రాళ్లు విసిరారు. ఆ యువకుడి సమీపానికి వద్దకు పరుగులు పెట్టి చేరుకునేసరికి పట్టాలపై ఉన్న యువకుడు పక్కకు తప్పుకున్నాడు. వాడిని పట్టుకుని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు స్థానికులు. మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. రైల్వే పోలీసులు వచ్చేలోగానే ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్థానికులు స్పందించడం కాస్త ఆలస్యమైన యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. క్షణాల్లో బతికి బట్ట కట్టడంతో.. భూమ్మీద ఇంకా నూకలు ఆ యువకుడికి మిగిలి ఉన్నాయని చర్చించుకుంటున్నారు జనం..
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
