AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫైన్‌లు కాదు.. ఇక కటకటాలే.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి 14 రోజుల జైలు శిక్ష!

ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా తరచూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్న వారిపై ఉక్కుపాదం మొపుతున్నారు తిరుపతి జిల్లా పోలీసులు.. తాజాగా మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని కోర్టులో హాజరు పర్చగా.. సదరు వ్యక్తికి కోర్టు 14 రోజుల జైలు శిక్ష విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది.

ఫైన్‌లు కాదు.. ఇక కటకటాలే.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి 14 రోజుల జైలు శిక్ష!
Court Awards 14 Day Jail Sentence To Youth In Tirupati
Anand T
|

Updated on: Sep 24, 2026 | 7:21 PM

Share

తిరుపతి, సెప్టెంబర్ 24: ట్రాఫిక్ రూల్స్‌ను పెడచెవిని పెట్టి మద్యం సేవించి వాహనం నడిపినందుకు ఓ వ్యక్తికి తిరుపతి ప్రత్యేక జేఎస్‌సీఎం కోర్టు ఏకంగా 14 రోజుల జైల శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. తాజాగా తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్‌ టెస్ట్‌లు నిర్వహించారు పోలీసులు.. ఈ తనిఖీల్లో నగరి మండలం, ఓ.జి. కుప్పం పోస్టు పరిధిలోని కేజీ కుప్పం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు.

దీంతో అతనిపై మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 185(a) కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ఈ విచారణ సందర్భంగా నిందితుడు నవీన్ కుమార్ కోర్టు ఎదుట తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 185(b) కింద అతన్ని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం.. అతనికి 14 రోజుల పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

ఈ సందర్భంగా గాజులమండ్యం పోలీసులు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ముప్పు పెరుగుతుందని, కాబట్టి వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం మత్తులో వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి 14 రోజుల జైలు శిక్ష!
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి 14 రోజుల జైలు శిక్ష!
రక్తహీనత, జుట్టు రాలే సమస్యలకు చెక్ పెట్టే రాగి రొట్టెలు..
రక్తహీనత, జుట్టు రాలే సమస్యలకు చెక్ పెట్టే రాగి రొట్టెలు..
ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు స్పెషల్‌ TET 2026.. మరికాసేపే గడువు
ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు స్పెషల్‌ TET 2026.. మరికాసేపే గడువు
మరోసారి ఆస్పత్రికి వెళ్లిన రామ్ చరణ్.. వీడియో వైరల్.. కారణమిదే
మరోసారి ఆస్పత్రికి వెళ్లిన రామ్ చరణ్.. వీడియో వైరల్.. కారణమిదే
పౌర్ణమితో వీరికి అదృష్టం..ఉద్యోగం, డబ్బు విషయంలో కొత్త అవకాశాలు
పౌర్ణమితో వీరికి అదృష్టం..ఉద్యోగం, డబ్బు విషయంలో కొత్త అవకాశాలు
అదేం శాడిజం రా.. ట్రైన్‌లోంచి ప్రయాణికులను తోసి చంపేస్తున్న సైకో
అదేం శాడిజం రా.. ట్రైన్‌లోంచి ప్రయాణికులను తోసి చంపేస్తున్న సైకో
నాట్యకళకు జీవితం అంకితం
నాట్యకళకు జీవితం అంకితం
డ్యాన్స్ పోటీలో ఫైనల్స్ కు చైనా రోబోలు..వీడియో ఇదిగో!
డ్యాన్స్ పోటీలో ఫైనల్స్ కు చైనా రోబోలు..వీడియో ఇదిగో!
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో 'రాకా'.. అల్లు అర్జున్ ఏమన్నారంటే?
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో 'రాకా'.. అల్లు అర్జున్ ఏమన్నారంటే?
రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 544 లెక్చరర్‌ ఉద్యోగాలు షురూ..
రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 544 లెక్చరర్‌ ఉద్యోగాలు షురూ..