RK Roja: ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా మంత్రి రోజా.. స్థానిక వైసీపీ నేతల్లో జోరుగా చర్చ..

ఒంగోలు వైసీపీ ఎంపీగా మంత్రి రోజాకు టికెట్‌ ఇస్తే ఎలా ఉంటుంది. గెలుపు అవకాశాలతో పాటు పార్లమెంట్‌ పరిధిలో అసెంబ్లీ అభ్యర్ధులకు రోజా గ్లామర్‌ ప్లస్‌ అవుతుందా. మరి ప్రకాశంజిల్లాలోని వైసీపీ నాయకులు ఏమంటారు. ఇలా ప్రకాశం జిల్లాలోని వైసీపీ నేతలకు అధిష్టానం నుంచి ఫోన్లు వస్తున్నాయట. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డితో పాటు, మంత్రి ఆదిమూలపు సురేష్‌లకు వైసీపీ అధిష్టానం ఫోన్ చేసి అడిగినట్టు సమాచారం.

RK Roja: ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా మంత్రి రోజా.. స్థానిక వైసీపీ నేతల్లో జోరుగా చర్చ..
Minister Rk Roja
Follow us

| Edited By: Srikar T

Updated on: Jan 28, 2024 | 3:13 PM

ఒంగోలు వైసీపీ ఎంపీగా మంత్రి రోజాకు టికెట్‌ ఇస్తే ఎలా ఉంటుంది. గెలుపు అవకాశాలతో పాటు పార్లమెంట్‌ పరిధిలో అసెంబ్లీ అభ్యర్ధులకు రోజా గ్లామర్‌ ప్లస్‌ అవుతుందా. మరి ప్రకాశంజిల్లాలోని వైసీపీ నాయకులు ఏమంటారు. ఇలా ప్రకాశం జిల్లాలోని వైసీపీ నేతలకు అధిష్టానం నుంచి ఫోన్లు వస్తున్నాయట. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డితో పాటు, మంత్రి ఆదిమూలపు సురేష్‌లకు వైసీపీ అధిష్టానం ఫోన్ చేసి అడిగినట్టు సమాచారం. అయితే మంత్రి రోజా కాకుండా, స్థానికంగా సిట్టింగ్‌ ఎంపీ మాగుంటకే తిరిగి అవకాశం ఇవ్వాలని విజయసాయి రెడ్డి చెప్పినట్లు అక్కడి నేతలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా మాగుంటకు ఈసారి వైసీపీ నుంచి అవకాశం లేదని అధిష్టానం తేల్చిచెప్పడంతో పాటు మరో రెండు రోజుల్లో ఒంగోలు ఎంపీ స్థానానికి కొత్త అభ్యర్ధిని ప్రకటిస్తాం.. రెడీగా ఉండండి అంటూ అధిష్ఠానం నుంచి సమాధానం వచ్చిందని చెబుతున్నారు. దీంతో ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా మంత్రి రోజా వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

రోజుకో కొత్తపేరు..

ఒంగోలు సిట్టింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి పలు కారణాలతో తిరిగి టికెట్‌ ఇచ్చేందుకు సీఎం వైయస్‌ జగన్‌ సుముఖంగా లేరు. ఈ పరిస్థితుల్లో మాగుంట టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్దమైపోయారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయని మాగుంట శిబిరంలో చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒంగోలు వైసీపీ ఎంపీగా ఎవర్ని రంగంలోకి దించాలన్న ఆలోచనలతో అధిష్టానం పలుపేర్లను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే ఇక్కడి నుంచి పోటీ చేయాలని తొలుత వైవీ సుబ్బారెడ్డి భావించినా, బాలినేని వ్యతిరేకించడంతో సుబ్బారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, ఎపీ రెడ్డి కార్పోరేషన్‌ ఛైర్మన్‌ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలించింది.

వీరిలో సీయం వైయస్‌ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఒంగోలు నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయించేందుకు అధిష్టానం సముఖత వ్యక్తం చేసింది. అందుకు అనుగుణంగా చెవిరెడ్డి ఇప్పటికే బాలినేనితో కూడా మంతనాలు చేశారు. ఆ తరువాత ఏమైందో ఏమో చెవిరెడ్డి కూడా పోటీ నుంచి తప్పుకున్నట్టే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో నగరి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజాను ఒంగోలు పార్లమెంట్‌ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని అధిష్టానం పరిశీలిస్తున్నట్లు గుజగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనితో పాటు మంత్రి ఆదిమూలపు సురేష్‌లను కూడా అధిష్టానం సంప్రదించింది. అయితే మంత్రి రోజా పార్లమెంట్‌కు పోటీ చేయడంపై స్థానిక నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరు ఏమనుకున్నా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కాబట్టి ఇక్కడ ఎంపీగా పోటీ చేసేందుకు ఎవర్ని పంపించినా పనిచేయకతప్పదు కదా అంటున్నారట వైసీపీ నేతలు. మరి ఒంగోలు నుంచి మంత్రి రోజా పార్లమెంట్‌ బరిలో ఉంటారా.. లేదా.. అన్నది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..